పూజా.. మజా!

స్కూళ్లకు సెలవులొస్తే.. పిల్లలు ఎంత ఆనందపడపోతారో కదా. అచ్చం అలాంటి అనుభూతిలోనే ఉంది పూజా హెగ్డే. వరుస సినిమాలు, షూటింగులతో గజిబిజిగా గడిపేసిన పూజా ఇప్పుడు సెలవుల్ని ఆస్వాదిస్తోంది. షూటింగులకు బ్రేక్‌ ఇచ్చి, విహారానికి వెళ్లిపోయింది. మాల్దీవుల్లో హాలీడే ఎంజాయ్‌ చేస్తూ, ఎప్పటికప్పుడు తన ఆనందాన్ని సోషల్‌ మీడియాలో పంచుకుంటోంది పూజా. ‘ఆచార్య’లో పూజా కీలక పాత్ర పోషించింది. ‘రాధే శ్యామ్‌’లో తనే కథానాయిక. ఈ రెండు చిత్రాలూ నెల రోజుల వ్యవధిలోనే విడుదల కాబోతున్నాయి. 


Advertisement