శివునికి సిగరెట్లతో పూజలు

ABN , First Publish Date - 2020-07-13T03:16:33+05:30 IST

ఈ గుడిలో... శివుడికి సిగరెట్‌లతో పూజలు చేస్తారు. హిమాచల్ ప్రదేశ్‌లోని సోలన్ జిల్లాలో ఓ శివాలయంలో ఇలా పూజలు జరుగుతాయి. సాధారణంగానైతే... శివలింగానికి అభిషేకాలు, పూలు, పళ్లు సమర్పించి దీపాలు, అగరుబత్తులు వెలిగిస్తారు. కానీ హిమాచల్ ప్రదేశ్‌లో... సిగరెట్లతో శివుడికి అభిషేకం చేస్తారు.

శివునికి సిగరెట్లతో పూజలు

సిమ్లా : ఈ గుడిలో... శివుడికి సిగరెట్‌లతో పూజలు చేస్తారు.  హిమాచల్ ప్రదేశ్‌లోని సోలన్ జిల్లాలో ఓ శివాలయంలో ఇలా పూజలు జరుగుతాయి. సాధారణంగానైతే... శివలింగానికి అభిషేకాలు, పూలు, పళ్లు సమర్పించి దీపాలు, అగరుబత్తులు వెలిగిస్తారు. కానీ హిమాచల్ ప్రదేశ్‌లో... సిగరెట్లతో శివుడికి అభిషేకం చేస్తారు.


ఈ శివాలయంలో ఈ వింత ఆచారం ఎన్నో ఏళ్ళ నుండి కొనసాగుతోంది. వివరాలిలా ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్‌లోని సోలన్ జిల్లాలోని లూట్రా మహాదేవ్‌ ఆలయంలో కొలువైన శివ లింగానికి ఇలా సిగరెట్లతో పూజలు చేస్తారు.


ఇక్కడికి వచ్చే భక్తులు... సిగరెట్లు వెలిగించి మొక్కులు చెల్లించుకుంటారు. అంతే కాదు... ఇక్కడికి వచ్చే భక్తులకు మరో విశ్వాసం కూడా ఉంది. అదేమిటంటే... సిగరెట్లను గర్భ గుడిలోని శివలింగంపై ఉంచగానే వాటంతట అవే వెలుగుతాయని నమ్ముతుంటారు. వారు నమ్మినట్టుగానే ఆ సిగరెట్లు కూడా వెలుగుతాయట. అయితే దీని వెనుక మిస్టరీ ఏమిటన్నది మాత్రం ఇంతవరకు వెలుగులోనికి రాలేదు.

Updated Date - 2020-07-13T03:16:33+05:30 IST