Abn logo
Sep 19 2021 @ 00:49AM

పేదవర్గాల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే

ముమ్మిడివరం, సెప్టెంబరు 18: పేదవర్గాల అభ్యున్నతికి ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి  కృషి చేస్తున్నారని  ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌కుమార్‌ అన్నారు. టిడ్కో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి గతంలో సొమ్ములు చెల్లించినవారికి చెక్కులు పంపిణీ సందర్భంగా ముమ్మిడివరం నగర పంచాయతీ కౌన్సిల్‌హాలులో శనివారం బొంతు సత్యశ్రీనివాస్‌ అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌కుమార్‌ ముఖ్యఅతిథిగా మాట్లాడారు. టిడ్కో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి  398మంది లబ్ధిదారులకు రూ.68,19,500 చెక్కులను పంపిణీ చేశారు. 10,18 వార్డుల్లో 846 డస్ట్‌బిన్లును పంపిణీ చేశారు. నగర పంచాయతీ చైర్మన్‌ కమిడి ప్రవీణ్‌కుమార్‌, ఏఎంసీ చైర్మన్‌ పెయ్యల భూలక్ష్మి, పెన్మెత్స చిట్టిరాజు, పెయ్యల చిట్టిబాబు, వేటుకూరి బోసురాజు, రెడ్డి శివన్నారాయణ, దొమ్మేటి అప్పారావు, సరిపెల్ల రామకృష్ణంరాజు, కమిషనర్‌ టి.నాగేంద్రకుమార్‌, కౌన్సిలర్లు పాల్గొన్నారు.