శ్రీవారి ఆలయం వద్ద వరాహాలు!

ABN , First Publish Date - 2021-01-18T09:07:09+05:30 IST

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం ముందు, మాడవీధుల్లో పందుల గుంపు సంచారంపై సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.

శ్రీవారి ఆలయం వద్ద వరాహాలు!

ఆంధ్రజ్యోతి, తిరుమల : తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం ముందు, మాడవీధుల్లో పందుల గుంపు సంచారంపై సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.  ఆదివారం వేకువజామున దాదాపు 11 వరాహాలు గొల్లమండపం నుంచి మాడవీధుల్లోకి వెళ్తున్న దృశ్యాల వీడియో హల్‌చల్‌ చేసింది. దీంతో విజిలెన్స్‌, ఫారెస్ట్‌, ఇంజినీరింగ్‌ అధికారులు మాడవీధులను పరిశీలించి శ్రీవారి ఆలయం, మాడవీధుల్లోకి పందులు వస్తున్న మార్గాలను గుర్తించి, ఇనుప కంచె ఏర్పాటు చేశారు. కాగా, శ్రీవారి ఆలయం ఉన్నది అటవీ ప్రాంతం కావడంతో పందులు రావడం సహజమేనని కొందరు అంటుంటే..  వీటిని అరికట్టడంలో టీటీడీ బోర్డు విఫలమవుతోందంటూ కొన్ని రాజకీయ పార్టీలు సోషల్‌ మీడియాలో విమర్శలు చేస్తుండటం గమనార్హం.   

Updated Date - 2021-01-18T09:07:09+05:30 IST