కట్టల ఆధునికీకరణకు నిపుణుల కమిటీ పరిశీలించాలి

ABN , First Publish Date - 2021-12-08T04:17:44+05:30 IST

పెన్నానది పొర్లుకట్టల ఆధునికీకరణ నిర్మాణానికి నిపుణుల కమిటీ పరిశీలించాలని రాష్ట్ర జలవనరుల ప్రముఖ్‌ మిడతల రమేష్‌ డిమాండ్‌ చేస్తూ మంగళవారం కలెక్టరేట్‌లో డీఆర్వో చిన ఓబులేశ్‌కు వినతిపత్రం అందజేశారు.

కట్టల ఆధునికీకరణకు నిపుణుల కమిటీ పరిశీలించాలి
కట్టలను నిపుణుల కమిటీ పరిశీలించాలని డీఆర్వోకి వినతిపత్రం ఇస్తున్న బీజేపీ నాయకులు

బీజేపీ జల సంరక్షణ రాష్ట్ర ప్రముఖ్‌ మిడతల  


బుచ్చిరెడ్డిపాళెం, డిసెంబరు 7: పెన్నానది పొర్లుకట్టల ఆధునికీకరణ నిర్మాణానికి నిపుణుల కమిటీ పరిశీలించాలని రాష్ట్ర జలవనరుల ప్రముఖ్‌ మిడతల రమేష్‌ డిమాండ్‌ చేస్తూ మంగళవారం కలెక్టరేట్‌లో డీఆర్వో చిన ఓబులేశ్‌కు వినతిపత్రం అందజేశారు. 80 కిలోమీటర్ల మేర ఉన్న పెన్నా పొర్లుకట్టల్లో వరద ఉధృతికి 14 ప్రాంతాల్లో కోతకు గురైందని డీఆర్వోకి వివరించారు. జొన్నవాడలో 150 నుంచి 200 మీటర్ల మేర, కుడితిపాళెం పరిధిలో కిలోమీటరు, ముదివర్తిలో 250మీటర్లు మేర పొర్లు కట్టలు కోతకు గురై భారీ గండ్లు ఏర్పడ్డాయని తెలిపారు.  శాశ్వత వరద నివారణ చర్యల్లో భాగంగా పొర్లుకట్టలను నిపుణుల కమిటీ పరిశీలించి సూచనలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో బుచ్చి బీజేపీ నాయకుడు కాసా శ్రీనివాసులు, బండారు సురేష్‌, జైచంద్ర, విష్ణువర్ధన్‌రెడ్డి,  నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-08T04:17:44+05:30 IST