పొర్లుకట్టల నిర్మాణమెప్పుడో..?

ABN , First Publish Date - 2021-10-28T04:35:46+05:30 IST

గతేడాది పెన్నానదికి వచ్చిన వరద కారణంగా నెల్లూరు నగరవా సులు నష్టపోయారు.

పొర్లుకట్టల నిర్మాణమెప్పుడో..?
పెన్నా బ్యారేజీ వద్ద పారుతున్న వరద నీరు

పెన్నాలో కొనసాగుతున్న వరద

మరింత పెరిగితే నగరంలోకి నీరు 

ఆందోళనలో ముంపు ప్రాంతవాసులు

గతేడాది ఇళ్లల్లోకి చేరిన వరద

పాఠాలు నేర్వని పాలకులు, అధికారులు


నెల్లూరు, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): గతేడాది పెన్నానదికి వచ్చిన వరద కారణంగా నెల్లూరు నగరవా సులు నష్టపోయారు. నెల్లూరులో పలుకాలనీలు నీట మునగడంతో అక్కడి వారంతా కట్టుబట్టలతో పునరావాస కేంద్రాలకు తరలివెళ్లారు. ఇళ్లు నీట మునగడంతో అందు లోని సామగ్రి అంతా పనికిరాకుండా పోయాయి. కొన్ని రో జులపాటు పేదలకు ఉపాధి లేకుండా పోయింది. ఆఖరు కు పేదలకు కోసం నిర్మించిన లేఅవుట్లు కూడా ముంపున కు గురయ్యాయి. ఈ క్రమంలో నెల్లూరు నగర పరిధిలో పెన్నాకు ఇరువైపులా పొర్లుకట్టలు నిర్మిస్తేనే భవిష్యత్‌లో మరోసారి వరద ముంపు  తలెత్తకుండా ఉంటుందని నిపు ణులు సూచించారు.ఈ నేపథ్యంలో పొర్లుకట్టల నిర్మాణాల కు అధికారులు ప్రతిపాదనలు పంపారు. పెన్నా బ్యారేజీకి దిగువన ప్రస్తుతం కొత్తగా నిర్మిస్తున్న రైల్వే మూడోలైన్‌ నుంచి జాతీయ రహదారి - 16 వరకు కిలోమీటర్‌ మేర పొర్లుకట్టల నిర్మా ణాలకు రూ.95 కోట్లతో తెలుగుగంగ ప్రాజెక్టు(టీజీపీ) అధికారులు ప్రతిపాదనలు  పంపారు. ఈ ప్రతిపాదనలను రూ.94.60 కోట్లకు సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. సుమారు ఎనిమిది లక్షలమందికిపైగా నివసించే నెల్లూరు లో అత్యవసరమైన పనికి ప్రభుత్వ స్థాయిలో పరిపాలనా అనుమతులివ్వడంలో ఆలస్యం జరిగితే, ఇప్పుడు అధికారు ల తీరుతో మరింత జాప్యం జరుగుతోంది. ఈ ఏడాది జూ లైలో ప్రభుత్వం పరిపాలనా అనుమతులు జారీ చేసినా, సాంకేతిక అనుమతులు పొందడంలో మాత్రం తీవ్ర జా ప్యం జరుగుతోంది. అప్పట్లో నెలల్లోపు టెండర్లు పూర్తి చేస్తామని చెప్పిన తెలుగుగంగ ప్రాజెక్టు అధికారులు ఇప్పటికీ టెండర్‌ ప్రక్రియ ప్రారంభించలేదు. 


వేలఇళ్లు మునక


గతేడాది నవంబరులో పెన్నాకి రికార్డుస్థాయిలో వరద పోటెత్తింది. సోమశిలలో గరిష్ఠంగా నాలుగు లక్షల క్యూసె క్కులను దిగువకు విడుదల చేశారు. దీంతో ఆ వరద తాకిడికి నెల్లూరులోని పెన్నాకు అటు, ఇటుగా ఉన్న ప్రాం తాలు నీట మునిగాయి. భగత్‌సింగ్‌ కాలనీ, జనార్దనరెడ్డికా లనీ, వెంకటేశ్వరపురం, గాంధీ గిరిజన కాలనీ, మనుమ సిద్ధినగర్‌, శివగిరికాలనీ, జయలలితా నగర్‌, పొర్లుకట్ట వంటి ప్రాంతాల్లో సుమారు మూడువేల ఇళ్లు వరద ముంపునకు గురయ్యాయి. దాదాపు 20 వేలమందిని అప్పట్లో పునరావాసాలకు తరలించారు. కొన్నిరోజుల పాటు వీరంతా ఇళ్లు వదిలి ఉండాల్సి వచ్చింది. వరదనీరు ఇళ్లల్లోకి చేరడంతో వస్తువులు దెబ్బతిన్నాయి. దీంతో భారీగా ఆస్తినష్టం వాటి ల్లింది. నగరానికి  రక్షణగా పెన్నా నదికి ఇరువైపులా పొర్లుకట్టలు లేవు. ఈ కారణంగానే ఓ మోస్తరు వరద నదిలో పారినా పలు ప్రాంతాలు నీట మునుగుతున్నాయి. గతేడాది సుమారు నాలుగు లక్షల క్యూసెక్కుల వరద పెన్నాలో పారితేనే నగరవాసులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఇక సోమశిల నుంచి గరిష్ఠంగా నీటిని దిగువకు విడుదల చేయాల్సి వస్తే పరిస్థితి ఏమిట న్నది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో వెంకటేశ్వరపురం ప్రాంతంలో పేదల కోసం పెద్ద లేఅవు ట్లు సిద్ధం చేశారు. గతేడాది వరదలకు ఈ లేఅవుట్లన్నీ మునిగిపోయాయి. ఈ నీటిని బయటకు పంపడానికి మో టార్లు ఉపయోగించాల్సి వచ్చింది. ముంపునకు గురయ్యే ప్రాంతంలో వేల ప్లాట్లు సిద్ధం చేసి పేదలకు ఇచ్చారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది కూడా లబ్ధిదారుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఈ లేఅవుట్లను ఎత్తు లేపినప్పటికీ లబ్ధిదా రుల్లో ఇంకా పూర్తిగా భయం పోలేదు. ఈ ప్రమాదకర వరద ముంపు నుంచి నగరం బయటపడాలంటే పెన్నాకు ఇరువైపులా పొర్లుకట్టలు నిర్మించడం ఒక్కటే మార్గంమని నిపుణులు సూచించారు. కాగా అప్పట్లో జిల్లాకు చెందిన మంత్రులిద్దరూ మునక ప్రాంతాల్లో పర్యటించి నగర పరిధిలో పెన్నాకు ఇరువైపుల పొర్లుకట్టలు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అయితే ఆ వెంటనే ప్రతిపాదనలు పంపి నా ప్రభుత్వం నుంచి అనుమతులు రావడంలో ఆలస్య మైంది. పరిపాలనా అనుమతులు వచ్చినా సాంకేతిక అను మతులు పొందడంలో మరింత జాప్యం జరుగుతోంది. 


ఈ ఏడాది కష్టమే..


పొర్లుకట్టల నిర్మాణ పనుల్లో మెజారిటీ భాగం ఎర్త్‌ వ ర్క్‌ చేయాల్సి ఉంది. ఇప్పటికే జిల్లాలో వర్షాలు మొదల య్యాయి. అదే సమయంలో ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కు రుస్తున్న వర్షాలకు గడిచిన నెల రోజులుగా వరద కొనసా గుతూనే ఉంది. కాగా ఇప్పటివరకు సాంకేతిక అనుమతు లు తీసుకోలేదు. ఆ అనుమతులు తీసుకొని టెండర్లు పూర్తి చేయడానికి కనీసం మరో నెల పడుతుంది. ఆ సమయం లో జిల్లాలో వర్షాలు కురిసే అవకాశముంది. దీంతో ఈ ఏ డాది ఇక పొర్లుకట్టల నిర్మాణ పనులు చేయడం ప్రారం భించడం కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 


పదిహేను రోజుల్లో టెండర్లు


 పొర్లుకట్టల నిర్మాణాలకు సాంకేతిక అనుమతులు రావాల్సి ఉంది. కొన్ని రెగ్యులేటర్లు, పంపులు ఏర్పాటు చే యాల్సి ఉన్న నేపథ్యంలో డ్రాయింగ్‌లు ఆలస్యమవుతున్నా యి. రెండు,మూడు రోజుల్లో సాంకేతిక అనుమతులొ స్తాయి. మరో పదిహేను రోజుల్లో టెండర్లకు వెళతాం. 

- హరినారాయణ్‌రెడ్డి, టీజీపీ ఇన్‌చార్జి సీఈ


Updated Date - 2021-10-28T04:35:46+05:30 IST