పోర్టబుల్‌ ఆస్పత్రులు వస్తున్నాయ్‌

ABN , First Publish Date - 2021-06-14T07:24:51+05:30 IST

కేవలం మూడువారాల్లోనే 100 పడకల పోర్టబుల్‌ ఆస్పత్రిని తయారు చేయగల పరిజ్ఞానాన్ని ఐఐటీ మద్రా్‌సలోని ‘మాడ్యులస్‌ హౌజింగ్‌’ కంపెనీ నిపుణులు అభివృద్ధి చేశారంటూ...

పోర్టబుల్‌ ఆస్పత్రులు వస్తున్నాయ్‌

  • మూడువారాల్లోనే 100 పడకలతో ఏర్పాటుచేసే పరిజ్ఞానం
  • అభివృద్ధి చేసిన ఐఐటీ మద్రాస్‌ స్టార్టప్‌ 

న్యూఢిల్లీ, జూన్‌ 13 : కేవలం మూడువారాల్లోనే 100 పడకల పోర్టబుల్‌ ఆస్పత్రిని  తయారు చేయగల పరిజ్ఞానాన్ని  ఐఐటీ మద్రా్‌సలోని  ‘మాడ్యులస్‌ హౌజింగ్‌’ కంపెనీ నిపుణులు అభివృద్ధి చేశారంటూ కేంద్ర ప్రభుత్వ ముఖ్య శాస్త్రీ య సలహాదారు(పీఎ్‌సఏ) కార్యాలయం ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. బిలా్‌సపూర్‌ (ఛత్తీ్‌సగఢ్‌), మహారాష్ట్రలోని అమరావతి, పుణె, జాల్న, పంజాబ్‌లోని మొహాలీలలో 100 పడకల పోర్టబుల్‌ ఆస్పత్రులను ఏర్పాటుచేసే పనులను ‘మాడ్యులస్‌’ ప్రారంభించిందని వెల్లడించింది. ఈ ఆస్పత్రులు ‘పోర్టబుల్‌’గా ఉంటాయి.. అంటే ఒక చోటు నుంచి మరోచోటుకు తరలించే వెసులుబాటు ఉంటుందన్న మాట. 


Updated Date - 2021-06-14T07:24:51+05:30 IST