చిరంజీవి పొరపాటు చేశారు.. జనం శిక్షించారు.. Pawan పాలిటిక్స్ వదిలిపెట్టాలంటూ పోసాని ఫైర్

ABN , First Publish Date - 2021-09-29T09:07:14+05:30 IST

సినీ నటుడు, వైసీపీ కార్యకర్త పోసాని కృష్ణమురళి పవన్‌ కల్యాణ్‌పై మరోసారి మండిపడ్డారు. ఆయన మంగళవారం మరోసారి మీడియా ముందుకు వచ్చారు. తన విమర్శలను పవన్‌ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారని.. గడిచిన 24 గంటల్లో తనను,

చిరంజీవి పొరపాటు చేశారు.. జనం శిక్షించారు.. Pawan పాలిటిక్స్ వదిలిపెట్టాలంటూ పోసాని ఫైర్

  • వెధవా.. బుద్ధి లేదా
  • బ్రోకర్‌గాడివి.. లోఫర్‌గాడివి.. సైకోవి.. తిడుతూనే ఉంటా
  • మీ అమ్మను, భార్యను కూడా తిడతా..  
  • రక్తకన్నీరు పెట్టుకుంటావు
  • పవన్‌పై  పోసాని బూతుపురాణం
  • తన కుటుంబ సభ్యులను పవన్‌  ఫ్యాన్స్‌ తిడుతున్నారని ఆగ్రహం


హైదరాబాద్‌, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): సినీ నటుడు, వైసీపీ కార్యకర్త పోసాని కృష్ణమురళి పవన్‌ కల్యాణ్‌పై మరోసారి మండిపడ్డారు.  ఆయన మంగళవారం మరోసారి మీడియా ముందుకు వచ్చారు. తన విమర్శలను పవన్‌ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారని.. గడిచిన 24 గంటల్లో తనను, తన కుటుంబ సభ్యులను తిడుతూ కొన్ని వందల ఫోన్‌ కాల్స్‌, మెసేజ్‌లు వచ్చాయని పోసాని తెలిపారు. ‘‘మీ ఫ్యాన్స్‌లాగా బూతులు తిట్టను’’.. అంటూనే బూతు పురాణం లంకించుకున్నారు.  ‘వెధవా, బుద్ధిలేదా, బ్రోకర్‌ గాడివి, లోఫర్‌ గాడివి, సైకోవి.. నా కొ..’ అంటూ అసభ్య పదజాలంతో పవన్‌ కల్యాణ్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘నన్ను విమర్శించు.. నా కుటుంబం జోలికి రావొద్దు’ అంటూనే.. పవన్‌ కల్యాణ్‌ కుటుంబంలోని మహిళలను కించపరుసూ బూతులపర్వాన్ని కొనసాగించారు. ‘రాజకీయాలు అంటే పబ్లిక్‌. నువ్వు రాజకీయాలు వదిలిపెట్టకపోతే నిన్ను వదిలిపెట్టేది లేదు. భవిష్యత్‌లోనూ ఇలాగే నిన్ను దుర్భాషలాడతాను. చేతనైతే రా నీ దమ్ము నా దమ్ము చూసుకుందాం’ అని పవన్‌కు బహిరంగ సవాల్‌ విసిరారు. ‘మీ కుటుంబానికి  సిగ్గు లేదా, నీ భార్యను, అమ్మను కూడా తిడతాను, చేతనైంది చేసుకో’ అంటూ ఆవేశంతో ఊగిపోయారు. ‘ఒక అమ్మాయికి కడుపు చేసి నోరు మూయించలేదా? దరిద్రపు నా కొ...’ అంటూ పవన్‌ కల్యాణ్‌పై రెచ్చిపోయారు. ‘‘రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. కానీ, పవన్‌కల్యాణ్‌ ముఖ్యమంత్రి జగన్‌ను నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడు. విషయాన్ని వ్యక్తిగతంగా తీసుకుని మాట్లాడుతున్నారు. అది కరెక్ట్‌ కాదు’’ అని అన్నారు. 


అతనొక నియంత అనుకుంటారు..

‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’ షూటింగ్‌ సమయంలో తనకు పవన్‌తో విభేదాలు వచ్చాయని, ఫలితంగా నన్ను ఆ సినిమా నుంచి తొలగించారని పోసాని తెలిపారు. ‘‘పవన్‌కల్యాణ్‌ ప్రజల మనిషి కాదు. ఇండస్ట్రీ మనిషి అంతకన్నా కాదు. అతనొక నియంత అనుకుంటారు. కేవలం తనని తాను ప్రేమించుకుంటారు. అలాం టి వ్యక్తి జగన్‌తో పోల్చుకుంటారా? పవన్‌ ప్రతి పార్టీని విమర్శించే పని పెట్టుకున్నారు. ఇప్పుడు వైసీపీని విమర్శిస్తున్నారు. నేను జగన్‌కు అభిమానిని. వైసీపీ కార్యకర్తను. ఆయన్ను ఏమన్నా అంటే నాకు కోపం వస్తుంది’’ అని తెలిపారు. ‘‘పవన్‌కల్యాణ్‌.. నీ సైకో ఫ్యాన్స్‌కు ఏం చెప్పుకుంటావో చెప్పుకో. నీకు దండం పెడతా. నా కుటుంబ సభ్యులను ఈ వివాదంలో లాగొద్దు. చిరంజీవిగారూ...మీ తమ్ముడిని అదుపులో పెట్టుకోండి.’’ అని పోసాని అన్నారు. చిరంజీవి పార్టీ పెట్టి పొరపాటు చేశారని.. ఆయన్ను జనం శిక్షించారని, అదంతా అయిపోయిందని, ఆయన వ్యక్తిత్వాన్ని విమర్శించకూడదని పోసాని అన్నారు.  ఎక్కడ ప్రశ్నించాలి? ఎప్పుడు ప్రశ్నించాలి? అన్నది పవన్‌కు తెలియదని పోసాని మండిపడ్డారు. 


అభిమానుల ఆగ్రహం

పవన్‌కల్యాణ్‌ను  దుర్భాషలాడుతున్న పోసానిని చూసి కొందరు పవన్‌ అభిమానులు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌కు వచ్చి దాడికి ప్రయత్నించారు.  అప్రమత్తమైన పోలీసులు వారిని పట్టుకొని పోలీస్టేషన్‌కు తరలించారు. అనంతరం పోసానిని పంజగుట్ట పోలీసులు దగ్గరుండి పోలీస్‌ వాహనంలో తీసుకెళ్లారు. 

Updated Date - 2021-09-29T09:07:14+05:30 IST