పెరుగుతున్న పాజిటివ్‌ కేసులు

ABN , First Publish Date - 2021-05-14T06:33:58+05:30 IST

కందుకూరు డివిజన్‌లో వివిధ గ్రామాల్లో కరోనా పాజిటివ్‌ కేసులు నానాటికి పెరుగుతున్నాయి.

పెరుగుతున్న పాజిటివ్‌ కేసులు
అవగాహన కల్పిస్తున్న ఎస్సైలో వ్యాక్సిన్‌ వేస్తున్న సిబ్బంది, పక్కన చైర్మన్‌ గఫార్‌

కందుకూరు డివిజన్‌లో వివిధ గ్రామాల్లో కరోనా పాజిటివ్‌ కేసులు నానాటికి పెరుగుతున్నాయి.

లింగసముద్రం, మే 13: మండలంలో గురువారం 14 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటిలో శింగరపాలెంలో 6, చినపవనిలో 5, ఉట్లవారిపాలెం, అంగిరేకుల పాడు, జంపాలవారిపాలెంలో ఒక్కొక్క కేసు  వచ్చినట్టు డా.రమేష్‌ తెలిపారు. ప్రజలు కరోనా జాగ్రత్తలు పాటించాలని కోరారు.

టంగుటూరు : కరోనా సెకండ్‌ వేవ్‌తో మండలంలో ఇప్పటికే అన్ని గ్రామాల్లో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా జరిపిన పరీక్షల్లో 20 మందికి పాజిటివ్‌ వచ్చింది.  ఇక కొండపి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ఐదుగురికి కరోనా పాజిటివ్‌గా నమోదైంది. 

కొవిడ్‌ బాధితులు ఇళ్లలోనే ఉండాలి : 

కనిగిరి : కరోనా బారిన పడిన కొవిడ్‌ బాధితులు వారి నివాసాల్లోనే ఉండాలని తహసీల్దార్‌ పుల్లారావు అన్నారు. మండలంలోని చిన్నఇర్లపాడు గ్రామంలో కొవిడ్‌ బాదితులు పెరుగుతున్న దృష్ట్యా గురువారం పారిశుధ్య చర్యలు చేపట్టారు. అనంతరం ప్రతి ఇంటికి వెళ్లి కరోనా బాదితుల వివరాలను సేకరించారు. ఆయన వెంట ఎంపీడీవో మల్లిఖార్జునరావు, రెవెన్యూ, పంచాయతీ సిబ్బంది ఉన్నారు. 

ముండ్లమూరు : మండలంలోని మారెళ్ల, ముండ్లమూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో గురువారం 50 మందికి వీఆర్‌డీఎల్‌ పరీక్షలు నిర్వహించినట్టు వైద్యాధికారులు మనోహన్‌రెడ్డి, వనజారెడ్డి తెలిపారు. ముండ్లమూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో 25 మందికి, మారెళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో 25 మందికి పరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు. 

మొగిలిచెర్ల(లింగసముద్రం), మే 13: మండలంలోని మొగిలిచెర్ల గ్రామంలో కరోనా కేసులు పెరుగుతుండడంతో కంటైన్మెంట్‌ జోన్లు ఏర్పాటు చేశారు. పంచాయతీ కార్యదర్శి నవీన్‌కుమార్‌, కర్ఫ్యూను పర్యవేక్షిస్తున్నారు. 

వలేటివారిపాలెం : స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం 30 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు మెడికల్‌ ఆఫీసర్‌ శ్రీనివాసరావు తెలిపారు. అందులో నాలుగు పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు తెలిపారు. 

290 మందికి  వ్యాక్సిన్‌ 

ముండ్లమూరు, మే 13: స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో గురువారం 290 మందికి కరోనా వ్యాక్సిన్‌ రెండో డోస్‌ వేసినట్టు వైద్యాధికారులు మనోహర్‌రెడ్డి, వనజారెడ్డి తెలిపారు. తాళ్లూరులో 18 మందికి వ్యాక్సిన్‌ వేశారు.

ఆదివారం సంపూర్ణ లాక్‌డౌన్‌

వలేటివారిపాలెం : కరోనా నివారణలో భాగంగా ఆదివారం సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలుజేస్తున్నట్లు టాస్క్‌ఫోర్స్‌ కమిటీ చైర్మన్‌ సయ్యద్‌ ముజిఫర్‌ రెహ్మన్‌ తెలిపారు.. ప్రజలు సహకరించాలన్నారు.

Updated Date - 2021-05-14T06:33:58+05:30 IST