బుడగ ఎలా బద్దలైంది?

ABN , First Publish Date - 2021-05-05T09:08:16+05:30 IST

అంతా భయపడినట్టే జరిగింది. ఎంతో సురక్షితమని భావించిన ఐపీఎల్‌ బయోబుడగ.. బద్దలైంది. అత్యంత సురక్షితమని భావించిన బయోబబుల్‌లో పాజిటివ్‌ కేసులు బయటపడడం అనేక అనుమానాలకు తావిస్తోంది.

బుడగ ఎలా బద్దలైంది?

అంతా భయపడినట్టే జరిగింది. ఎంతో సురక్షితమని భావించిన ఐపీఎల్‌ బయోబుడగ.. బద్దలైంది. అత్యంత సురక్షితమని భావించిన బయోబబుల్‌లో పాజిటివ్‌ కేసులు బయటపడడం అనేక అనుమానాలకు తావిస్తోంది. వాస్తవంగా లీగ్‌ ఆరంభానికి ముందు ప్రమాద ఘంటికలు వినిపించినా.. బీసీసీఐ వాటిని పెడచెవిన పెట్టింది. అయితే, బోర్డు చేసిన తప్పిదాలేంటి?


యూఏఈకి తరలించక పోవడం..

లీగ్‌ గురించిన ప్రతిపాదనల్లో తొలుత ఈ ఏడాది టోర్నీని యూఈఏలో నిర్వహించాలనే దానికి బీసీసీఐ సానుకూలంగానే స్పందించింది. ఫ్రాంచైజీలు, బ్రాడ్‌కాస్టర్లు కూడా మంచి నిర్ణయమని సమర్థించారు. కానీ, ఆ తర్వాత బీసీసీఐ స్వదేశంలోనే లీగ్‌ను నిర్వహించాలనే ప్రతిపాదన చేసింది.

 

ఆరు వేదికల్లోనా?

ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతిస్తున్నప్పుడు కారవ్యాన్‌ మోడల్‌ సమర్థనీయమే. కానీ, ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్‌లు నిర్వహించాలని భావించినప్పుడు ఆరు వేదికలు.. ఢిల్లీ, ముంబై. కోల్‌కతా, చెన్నై, అహ్మదాబాద్‌, బెంగళూరు వేదిల్లో నిర్వహించాల్సిన అవసరమేంటి? దేశంలో కరోనా ఉద్ధృతంగా ఉన్న ఇలాంటి సమయంలో ఆటగాళ్లను ఇన్ని వేదికల్లో తిప్పడం వల్ల ప్రమాదం ఎప్పుడూ పొంచే ఉంటుంది.

 

మంచి కంపెనీ సేవలను పొందలేక పోవడం

గత సీజన్‌లో యూఈఏలో నిర్వహించిన లీగ్‌లో సెంట్రల్‌ బయోబబుల్‌ ఏర్పాటు కోసం లండన్‌కు చెందిన రెస్ట్రా కంపెనీ సేవలను బీసీసీఐ వినియోగించుకొంది. కానీ, ఈసారి నిర్లిప్తత ప్రదర్శించింది. 


సమన్వయం లేకపోవడం:

హోటల్‌ బుకింగ్‌ విషయంలోనూ ఫ్రాంచైజీలు, బీసీసీఐ మధ్య సమన్వయం కనిపించలేదు. ఓ టీమ్‌ ముంబై స్టేడియానికి 10 కి.మీ. దూరంలో హోటల్‌ బుక్‌ చేసుకుంది.. అందునా ఓ కమర్షియల్‌ కాంప్లెక్స్‌లో? జనానికి దూరంగా ఉండాల్సిన సమయంలో ఇలా జనసమర్థంగా ఉండే ప్రాంతంలో హోటల్‌లో ఉండి.. రాకపోకల వల్ల రిస్క్‌ ఎంతో ఎక్కువైంది. 


ఐపీఎల్‌లో ఆస్ట్రేలియన్లు

చెన్నై: జాసన్‌ బెహ్రెన్‌డార్ఫ్‌, మైకేల్‌ హస్సీ (కోచ్‌)

ఢిల్లీ: స్టీవెన్‌ స్మిత్‌, స్టొయినిస్‌, పాంటింగ్‌ (చీఫ్‌ కోచ్‌), హోప్స్‌ (కోచ్‌)

కోల్‌కతా: పాట్‌ కమిన్స్‌, బెన్‌ కటింగ్‌, డేవిడ్‌ హస్సీ (కోచ్‌)

ముంబై: నాథన్‌ కల్టర్‌ నైల్‌, క్రిస్‌ లిన్‌ 

పంజాబ్‌: హెన్రిక్స్‌, జే రిచర్డ్‌సన్‌, మెరిడిత్‌, డామియన్‌ రైట్‌ (కోచ్‌)

బెంగళూరు: ఆడమ్‌ జంపా, రిచర్డ్‌సన్‌, మ్యాక్స్‌వెల్‌, డాన్‌ క్రిస్టియన్‌, డానియల్‌ సామ్స్‌, కటిచ్‌ (చీఫ్‌ కోచ్‌), గ్రిఫిత్‌ (బౌలింగ్‌ కోచ్‌) 

హైదరాబాద్‌: వార్నర్‌, బేలిస్‌ (చీఫ్‌ కోచ్‌), బ్రాడ్‌ హాడిన్‌ (సహాయ కోచ్‌), టామ్‌ మూడీ (డైరెక్టర్‌ ఆఫ్‌ క్రికెట్‌)

రాజస్థాన్‌: ఆండ్రూ టై

Updated Date - 2021-05-05T09:08:16+05:30 IST