25 తరువాత నీటి విడుదలకు అవకాశం

ABN , First Publish Date - 2021-06-19T05:43:08+05:30 IST

వానాకాలం పంటలకు దిగువ మానేరు జలాశయం నుంచి కాకతీయ కాలువ ద్వారా ఈ నెల 25వ తేదీ తరువాత నీటి విడుదల చేసే అవకాశం ఉం దని కరీంనగర్‌ ప్రాజెక్టుల ఇం జనీర్‌ ఇన్‌ ఛీఫ్‌ శంకర్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలి పారు.

25 తరువాత నీటి విడుదలకు అవకాశం
ఎల్‌ఎండీ జలాశయం

కరీంనగర్‌ ప్రాజెక్టుల ఇంజనీర్‌ ఇన్‌ ఛీఫ్‌ శంకర్‌

తిమ్మాపూర్‌, జూన్‌ 18: వానాకాలం పంటలకు దిగువ మానేరు జలాశయం నుంచి కాకతీయ కాలువ ద్వారా ఈ నెల 25వ తేదీ తరువాత నీటి విడుదల చేసే అవకాశం ఉం దని కరీంనగర్‌ ప్రాజెక్టుల ఇం జనీర్‌ ఇన్‌ ఛీఫ్‌ శంకర్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలి పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సారా ర్‌, ఎల్‌ఎండీ రిజర్వాయర్లను పూర్తి స్థాయిలో నింపి రైతులకు అవసరం ఉన్న సమయంలో కావలసినంత నీటిని విడుదల చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుక్ర వారం ఆదేశించారన్నారు. దానికి అనుగుణంగా రిజర్వా యర్లను పూర్తి స్థాయిలో నింపుతామని తెలిపారు. ప్రస్తుతం కాళేశ్వరం నుంచి గాయత్రి పంప్‌ హౌస్‌ ద్వారా శ్రీరాజరాజేశ్వర జలాశయంలోకి 9,450 క్యూసె క్కుల నీరు వస్తోందని, ఎస్సారార్‌ ప్రాజెక్టు రివర్స్‌ స్లూయిస్‌ల ద్వారా ఎల్‌ఎండీలోకి 6,300 క్యూసెక్కుల నీరు శుక్రవారం విడుదల చేశారని చెప్పారు. శనివారం మానకొండూర్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ అధ్యక్ష తన నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించి రైతులకు ఎంత మేర, ఎప్పుడు నీటి అవశ్యకత ఉందో చర్చిస్తామన్నారు. దానికనుగుణంగా దిగువకు నీటిని విడుదల చేస్తామన్నారు. ఎల్‌ఎండీ దిగువలో ఉన్న అన్ని కుంటలు, చెరువులను నింపుతామని చెప్పారు. ఎల్‌ఎండీ పూర్తి స్ధాయి నీటి మట్టం 24.034 టీఎంసీలు కాగా శుక్రవారం సాయంత్రం వరకు 10.483 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు తెలిపారు.


Updated Date - 2021-06-19T05:43:08+05:30 IST