Advertisement
Advertisement
Abn logo
Advertisement
Aug 22 2021 @ 11:01AM

తాలిబన్‌కు మద్దతుగా పోస్టులు... 14 మంది అరెస్ట్!

డిస్పూర్: అఫ్ఘానిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్నందుకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన అసోంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 14 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిపై చట్టవ్యతిరేక కార్యకలాపాలను పాల్పడుతున్నారన్న ఆరోపణలపై కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఉదంతంలో అసోంలోని కామరూప్, బార్పేటా, ధుబారీ జిల్లాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు చొప్పున అరెస్టయ్యారు. 

ఇదేవిధంగా దరంగ్, దక్షిణ సల్మారా, గోవాల్‌పారా, హోజాయీ జిల్లాలకు చెందినవారు ఒక్కొక్కరు చొప్పున అరెస్టయ్యారు. బరాక్ ఘాటీ జిల్లాలో నలుగురు అరెస్టయ్యారు. ఈ సందర్భంగా పోలీసు అధికారి వాయ్లెట్ బరువా మాట్లాడుతూ సోషల్ మీడియాలో అఫ్ఘానిస్తాన్‌కు మద్దతుగా వస్తున్న పోస్టులపై తాము దృష్టి సారించామని ఇటువంటి చర్యలకు పాల్పడేవారిపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 


Advertisement
Advertisement