పోస్టల్​ డిపాజిట్లు... కొత్త ఐవీఆర్‌...

ABN , First Publish Date - 2021-10-22T06:19:42+05:30 IST

ఐపీపీబీ(ఇండియన్​ పోస్ట్​ పేమెంట్ బ్యాంక్‌)లో సేవింగ్స్​ ఖాతాలుండే ఖాతాదారులకు వెసులుబాటు. పోస్టల్​ డిపాజిట్లను సులభతరం చేసేందుకు పోస్టల్​ విభాగం తాజాగా కొత్త ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్(ఐవీఆర్) విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది.

పోస్టల్​ డిపాజిట్లు... కొత్త ఐవీఆర్‌...

న్యూఢిల్లీ : ఐపీపీబీ(ఇండియన్​ పోస్ట్​ పేమెంట్ బ్యాంక్‌)లో సేవింగ్స్​ ఖాతాలుండే ఖాతాదారులకు వెసులుబాటు. పోస్టల్​ డిపాజిట్లను సులభతరం చేసేందుకు పోస్టల్​ విభాగం తాజాగా కొత్త ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్(ఐవీఆర్) విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. మొబైల్ ఫోన్​ ద్వారానే ఈ కొత్త సదుపాయాన్ని పొందవచ్చు.


ఈ కొత్త ఐవీఆర్​ సేవతో మీ పోస్టల్​ పెట్టుబడులకు సంబందించిన వడ్డీ, బ్యాలెన్స్​, డిపాజిట్​ వివరాలు, ఏటీఎమ్​ కార్డ్ బ్లాకింగ్, సౌకర్యాలతో పాటు వివిధ పోస్టల్ సేవింగ్ ఉత్పత్తులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. డిపార్ట్‌మెంట్ జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం, పీపీఎఫ్​, ఎన్​ఎస్​సీ వంటి చిన్న పొదుపు పథకాల్లో పెట్టుబడి పెట్టిన ఖాతాదారులు... 18002 666868 ట్రోల్​ ఫ్రీ నంబర్​కు కాల్​ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

ఈ ఐవీఆర్​ ఫెసిలిటీలో 1 నంబర్​ నొక్కితే హిందీలో సమాచారం వస్తుంది. 2 నంబర్​ నొక్కితే ఇంగ్లీష్​లో సమాచారం వస్తుంది.


మరోవైపు, దీని ద్వారా పోస్టల్​ డెలివరీ సేవలు, రిజిస్టర్​ పోస్ట్​ సేవలు, జీవిత బీమా ప్రీమియం గడువు తేదీ, ప్రీమియం మొత్తం, పాలసీ స్టేటస్​, పాలసీ మెచ్యూరిటీ తేది, హామీ మొత్తం, బ్యాంకింగ్​, ఇన్సూరెన్స్​ సేవలు అన్ని పథకాల్లో ఖాతా బ్యాలెన్స్​, డెబిట్​ కార్డు సేవలు, పోస్టాఫీస్​ అందించే చిన్న మొత్తాల పొదుపు పథకాలు సహా ఇతరత్రా సేవల గురించి సమాచారం తెలుసుకునే వీలుంటుంది. 

Updated Date - 2021-10-22T06:19:42+05:30 IST