భీమవరం పోస్టల్‌ డివిజన్‌కు రాష్ట్ర ప్రథమ స్థానం

ABN , First Publish Date - 2021-10-17T05:11:37+05:30 IST

భీమవరం పోస్టల్‌ డివిజన్‌ రాష్ట్ర స్ధాయిలో అన్ని విభాగాల్లోను ప్రథమ స్ధానంలో ఉందని పోస్టల్‌ సీనియర్‌ సూపరింటెండెంట్‌ గరికిపాటి శివనాగరాజు తెలిపారు.

భీమవరం పోస్టల్‌ డివిజన్‌కు రాష్ట్ర ప్రథమ స్థానం

భీమవరంటౌన్‌, అక్టోబరు 16 : భీమవరం పోస్టల్‌ డివిజన్‌ రాష్ట్ర స్ధాయిలో అన్ని విభాగాల్లోను ప్రథమ స్ధానంలో ఉందని పోస్టల్‌ సీనియర్‌ సూపరింటెండెంట్‌ గరికిపాటి శివనాగరాజు తెలిపారు. జాతీయ తపాలా వారోత్సవాల ముగింపు సందర్భంగా శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 1550 సుకన్య సమృద్ధి ఖాతాలను తెరిచి రాష్ట్రంలోనే ప్రఽథమస్థానంలో నిలిచామని తెలిపారు. ఉత్తమ ప్రతిభకనపరచిన ఉద్యోగులను సత్కరించారు. కార్యక్రమంలో అల్లు సురేష్‌, కె.ఆశిబాబు,రంగసాయి,రామకృష్ణ పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-17T05:11:37+05:30 IST