పోస్టాఫీస్ నెలవారీ ఆర్డీ చెల్లింపులు ఇంటినుండే చేయొచ్చు...

ABN , First Publish Date - 2021-01-15T19:31:54+05:30 IST

పోస్టాఫీసుల్లో ఆర్‌డీ(రికరింగ్ డిపాజిట్)లు కట్టేవారు ఇక పోస్టాఫీసులకు పనిగట్టుకుని మరీ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే... ఈ చెల్లింపులను ఇంటినుంచే నేరుగా చేసుకునే వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది వివరాలిలా ఉన్నాయి.

పోస్టాఫీస్ నెలవారీ ఆర్డీ చెల్లింపులు ఇంటినుండే చేయొచ్చు...

న్యూఢిల్లీ : పోస్టాఫీసుల్లో ఆర్‌డీ(రికరింగ్ డిపాజిట్)లు కట్టేవారు ఇక పోస్టాఫీసులకు పనిగట్టుకుని మరీ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే... ఈ చెల్లింపులను ఇంటినుంచే నేరుగా చేసుకునే వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది వివరాలిలా ఉన్నాయి.  


ఐపీపీబీతో ఆన్‌లైన్ చెల్లింపులు సులభం... మారుతున్న కాలానికణుగుణంగా పోస్టాఫీస్ కూడా సాంకేతిక పరిజ్ఙానాన్ని అందిపుచ్చుకుంటోంది. ప్రత్యేకించి... ఇండియా పోస్టల్ పేమెంట్ బ్యాంక్ (ఐపీపీబీ) పేరుతో ప్రత్యేకంగా ఓ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనిద్వారా నెలవారీ రికరింగ్ డిపాజిట్ మొత్తాలను పోస్టాఫీస్‌కు వెళ్లకుండానే, గంటల తరబడి క్యూలో నిల్చునే ఇబ్బంది లేకుండానే చెల్లించడానికి అవకాశం ఏర్పడింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో పోస్టాఫీస్ వరకూ వెళ్లకుండా నెలవారీ ఆర్డీ మొత్తాన్ని చెల్లించడంపై ఖాతాదారులు ఆసక్తి కనబరుస్తున్నారు. 


చెల్లింపు విధానం ఇలా...

 యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న తరువాత... తొలుత డీఓపీ ప్రొడక్ట్స్ అనే విభాగాన్ని ఎంపిక చేసుకోవాలి. దానిపై క్లిక్ చేయగానే రికరింగ్ డిపాజిట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అందులో ఆర్డీ నంబర్, కస్టమర్ ఐడీని ఎంటర్ చేయాలి. ఎంత మొత్తాన్ని చెల్లించాలి ? ఇన్‌స్టాల్‌మెంట్ ఎంత అనేది ఎంపిక చేసుకున్న తరువాత నగదును బదిలీ చేయాలి. నెలవారీ మొత్తాన్ని డిపాజిట్ చేసిన వెంటనే పోస్టాఫీస్ నుంచి.. దీనికి సంబంధించిన సమాచారం అందుతుంది. 

Updated Date - 2021-01-15T19:31:54+05:30 IST