Abn logo
Sep 20 2021 @ 09:33AM

‘డెలివరీ బాయిస్ లిఫ్టు వాడకూడదు’... నోటీసుపై జనం ఆగ్రహం!

న్యూఢిల్లీ: 2020లో కరోనా మహమ్మారి దేశంలోకి ప్రవేశించినప్పుడు లాక్‌డౌన్ విధించిన సమయంలో జనం ఇళ్లలో బంధీలుగా మారిపోయారు. ఆహారం కోసం స్విగ్గీ, జొమాటో డెలివరీలపై ఆధార పడ్డారు. ఈ నేపధ్యంలో డెలివరీ బాయిస్ పలు ఇక్కట్లను కూడా ఎదుర్కొన్నారు. తాజాగా ట్విట్టర్, వాట్సాప్‌లలో ఒక పోస్టర్ హల్‌చల్ చేస్తోంది. దీనిని చూసిన ప్రతీవారూ ఇక మానవత్వం అంతరించిపోయిందని అంటున్నారు. ప్రముఖ జర్నలిస్టు శోభనా నాయర్ సోషల్ మీడియాలో ఒక నోటీసుకు సంబంధించిన ఫొటోను షేర్ చేశారు. ఆ నోటీసుపై ‘స్విగ్గీ, జొమాటో డెలివరీ బాయిస్ లిఫ్టు వినియోగించేందుకు అనుమతి లేదు’ అని రాసివుంది. 

లిఫ్టుకు బదులు వారు మెట్లు వాడుకోవాలని దానిలో సూచన ప్రాయంగా తెలియజేశారు. ఈ నోటీసు రాజస్థాన్‌లోని ఉదయ్ పూర్‌లోని ఒక ఫుడ్ కోర్టు ముందు కనిపించినట్లుగా తెలుస్తోంది. ఈ పోస్టును చూసిన యూజర్లు వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ నోటీసు అతికించిన వ్యక్తిని 10 ప్లోర్లు కలిగిన బిల్డింగ్‌లో పైనుంచి కిందకు పదిసార్లు మెట్లమీద నడవనివ్వాలని ఒక యూజర్ అన్నారు. మరొక యూజర్... ఫుడ్ ఆర్డర్ చేసినవారే కిందకు వచ్చి డెలివరీ బాయ్ నుంచి పార్సిల్ అందుకోవాలని సూచించారు.

ఇవి కూడా చదవండిImage Caption

ప్రత్యేకంమరిన్ని...