భ్రదాచలంలో మావోయిస్టులకు వ్యతిరేకంగా పోస్టర్లు..

ABN , First Publish Date - 2021-12-06T13:48:30+05:30 IST

భద్రాచలం, దుమ్ముగూడెంలో మావోయిస్టులకు వ్యతిరేకంగా పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. పీఎల్‌జీఏ మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో..మావోయిస్టుల తీరుకు నిరసనగా విధానాలను

భ్రదాచలంలో మావోయిస్టులకు వ్యతిరేకంగా పోస్టర్లు..

భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలం, దుమ్ముగూడెంలో మావోయిస్టులకు వ్యతిరేకంగా పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. పీఎల్‌జీఏ మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో..మావోయిస్టుల తీరుకు నిరసనగా విధానాలను ప్రశ్నిస్తూ పోస్టర్లు కనిపిస్తున్నాయి. నక్సలైట్లు అంటే నరహంతకులు కాదా..?, అభివృద్ధిని అడ్డుకోడం నక్సలిజమా..? అంటూ మావోయిస్టు పార్టీకి సూటి ప్రశ్నలు వేస్తూ పోస్టర్లు కలకలం రేపుతున్నాయి.


తుపాకీ గొట్టం ద్వారా 50 ఏళ్లలో సాధించింది ఏమిటని పోస్టర్లలో పేర్కొన్నారు. అమాయక ప్రజలను పార్టీలో చేరమని ప్రోత్సహిస్తూ వారి జీవితాలను నాశనం చేయడమేనా వారోత్సవాలు అంటూ?.. మావోయిస్టుల విధానాలను ప్రశ్నిస్తూ పోస్టర్లు దర్శనిమిస్తున్నాయి. మావోలకు వ్యతిరేకంగా పోస్టర్లు ఉండటంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. అయితే ఈ పోస్టర్లు ఎవరు ఇలా వైరల్ చేస్తున్నారనే విషయం ఇంకా తెలియరాలేదు. ఇంతవరకూ ఏ సంఘాలు కూడా దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు.

Updated Date - 2021-12-06T13:48:30+05:30 IST