విజయమ్మ, షర్మిల కేసు 15కు వాయిదా

ABN , First Publish Date - 2021-04-09T08:53:15+05:30 IST

పరకాల ఉప ఎన్నికలో నిబంధనలు ఉల్లంఘించినందుకు వైఎస్‌ విజయమ్మ, షర్మిలపై నమోదైన కేసు విచారణ వాయిదా పడింది.

విజయమ్మ, షర్మిల కేసు 15కు వాయిదా

హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): పరకాల ఉప ఎన్నికలో నిబంధనలు ఉల్లంఘించినందుకు వైఎస్‌ విజయమ్మ, షర్మిలపై నమోదైన కేసు విచారణ వాయిదా పడింది. గురువారం వారు నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరుకాకపోవడంతో వారి తరపు న్యాయవాది ఆబ్సెంట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషన్‌ స్వీకరించిన కోర్టు విచారణను ఈనెల 15కు వాయిదా వేసింది. మరో వైపు ప్రజాప్రతినిధుల కోర్టులో మంత్రి సత్యవతి రాథోడ్‌, ఎంపీ మాలోతు కవిత, మాజీ మంత్రి చందూలాల్‌, మాజీ ఎంపీ సీతారాం నాయక్‌లపై ఉన్న కేసును కోర్టు కొట్టి వేసింది. నిబంధనలకు విరుద్ధంగా ప్రచారం నిర్వహించారని వెంకటాపురంలో ఈ కేసు నమోదైంది. కాగా, ఇతర కేసుల్లో ప్రభుత్వ చీఫ్‌ విప్‌ వినయ్‌ భాస్కర్‌, ఎమ్మెల్యేలు రాజయ్య, కంచర్ల భూపాల్‌రెడ్డి, మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌ యాదవ్‌, శంకర్‌రావు కోర్టుకు హాజరయ్యారు. 

Updated Date - 2021-04-09T08:53:15+05:30 IST