ఆలూ బరడా

ABN , First Publish Date - 2020-10-31T18:47:01+05:30 IST

ఒక్కో ప్రాంతంలో ఒక్కోరకమైన ఆహారపు అలవాట్లు,. భిన్నమైన రుచులు ఉంటాయి. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే చేసే ఆలూ బరడా, బరడా పాల్యా, దొండకాయ బరడా, దోసకాయ

ఆలూ బరడా

పసందైన బరడా రుచులు

ఒక్కో ప్రాంతంలో ఒక్కోరకమైన ఆహారపు అలవాట్లు,. భిన్నమైన రుచులు ఉంటాయి. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే చేసే ఆలూ బరడా, బరడా పాల్యా, దొండకాయ బరడా, దోసకాయ బరడా, గుమ్మడికాయ బరడా... వంటలు అలాంటివే. కాస్త వెరైటీ రుచులను ఆస్వాదించాలంటే ఈ వారం బరడా వంటలను మీరూ ట్రై చేయండి. 


కావలసినవి: ఆలుగడ్డలు - పావుకేజీ, ఉల్లిపాయ - ఒకటి, పచ్చిమిర్చి - ఒకటి, పసుపు - చిటికెడు, కారంపొడి - ఒక టీస్పూన్‌, ధనియాల పొడి - ఒక టీస్పూన్‌, కరివేపాకు - రెండు రెబ్బలు, ఉప్పు - తగినంత, ఆవాలు - ఒక టీస్పూన్‌, జీలకర్ర - ఒక టీస్పూన్‌, నూనె - నాలుగు టేబుల్‌స్పూన్లు.


బరడా : సెనగపప్పు - నాలుగు టేబుల్‌స్పూన్లు, పెసరపప్పు - రెండు టేబుల్‌స్పూన్లు


తయారీ విధానం: ఆలుగడ్డల పొట్టు తీసి కొంచెం పెద్ద ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. ఉల్లిపాయలు సన్నగా తరగాలి. సెనగపప్పు, పెసరపప్పు కలిపి పొడి చేసి పెట్టుకోవాలి. బాణలిలో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి వేగించాలి. పసుపు, కరివేపాకు, కారం, ధనియాల పొడి వేసి కలపాలి. తరువాత ఆలుగడ్డ ముక్కలు వేసి కలుపుతూ వేగించాలి. తగినంత ఉప్పు వేసి ఒక కప్పు నీళ్లు పోసి చిన్న మంటపై ఉడికించాలి. ఆలుగడ్డ ముక్కలు ఉడికిన తరువాత తయారు చేసి పెట్టుకున్న పొడి వేసి కలపాలి. మరో రెండు నిమిషాల వేగించి, కొత్తిమీర వేసి దింపాలి. ఈ బరడా అన్నంలోకి లేదా రొట్టెలలోకి రుచిగా ఉంటుంది.


ఆలుగడ్డ


క్యాలరీలు -  93

కార్బోహైడ్రేట్లు - 21గ్రా

ప్రోటీన్లు - 2.5గ్రా



Updated Date - 2020-10-31T18:47:01+05:30 IST