శిల్పా చిప్స్‌!

ABN , First Publish Date - 2020-04-13T05:30:00+05:30 IST

బాలీవుడ్‌ నటి, యోగా శిక్షకురాలు శిల్పాశెట్టి.. ఆమె తొలి ప్రాధాన్యం ఆరోగ్యం. లాక్‌డౌన్‌ కాలంలో ఎక్కువ కేలరీలు, కృత్రిమ రంగులు ఉండే ...

శిల్పా చిప్స్‌!

బాలీవుడ్‌ నటి, యోగా శిక్షకురాలు శిల్పాశెట్టి.. ఆమె తొలి ప్రాధాన్యం ఆరోగ్యం. లాక్‌డౌన్‌ కాలంలో ఎక్కువ కేలరీలు, కృత్రిమ రంగులు ఉండే ప్యాకేజ్డ్‌ ఫుడ్‌ జోలికి వెళ్లకుండా, ఆరోగ్యకరమైన ఆహారాన్నే తినాలంటున్నారు ఆమె. అలాంటి మంచి ఆరోగ్యకరమైన ఆహారం బంగాళదుంప చిప్స్‌.. తయారీ గురించి శిల్ప ఇటీవల తన యూట్యూబ్‌ చానెల్లో ఇలా వివరించారు...


కావలసిన పదార్థాలు: బంగాళదుంపలు - 2, చిలగడదుంప - 1, కారం, ఉప్పు, నూనె, మిరియాలు - తగినంత


తయారీ: ముందుగా బంగాళదుంపలను బాగా కడగండి.స్లైసర్‌తో పలుచని పొరలుగా చెక్కు తీయాలి. వీటిని డ్రై పేపర్‌ టవల్‌ మీద ఉంచి టిష్యూపేపర్‌తో నెమ్మదిగా అదిమితే తేమ పీల్చుకొని బాగా ఆరతాయి. తరువాత మిరియాలు, కారం, ఉప్పు, నూనెలు కలిపి ఈ చిప్స్‌కు బాగా పట్టించాలి. ట్రేలోపల ఆయిల్‌ను పూతలా రాసి సిద్ధం చేసుకున్న చిప్స్‌ను ఒకదానికి మరొకటి తాకకుండా ఎడంగా ఉంచాలి. ఓవెన్‌ను 120 డిగ్రీల వరకూ ప్రీహీట్‌ చే యాలి. ట్రేను అందులో గంటసేపు ఉంచి బయటకు తీయాలి. పావుగంట పాటు చల్లారనివ్వాలి. కరకరలాడుతూ నోటికి విందు చేసే బంగాళదుంప చిప్స్‌ రెడీ. గాలి చొరబడని డబ్బాలో ఉంచుకోని కాలక్షేపానికి తింటే సరి!

Updated Date - 2020-04-13T05:30:00+05:30 IST