పోతలపాడు వీఆర్వో సస్పెన్షన్‌

ABN , First Publish Date - 2021-08-12T06:57:06+05:30 IST

అసైన్డ్‌ భూములకు పట్టాలు ఇప్పిస్తానని రైతులకు మాయమాటలు చెప్పి భారీస్థాయిలో వసూళ్లకు పాల్పడిన పోతలపాడు వీఆర్వోపై వేటుపడింది.

పోతలపాడు వీఆర్వో సస్పెన్షన్‌

తర్లుపాడు, ఆగస్టు 11: అసైన్డ్‌ భూములకు పట్టాలు ఇప్పిస్తానని రైతులకు మాయమాటలు చెప్పి భారీస్థాయిలో వసూళ్లకు పాల్పడిన పోతలపాడు వీఆర్వోపై వేటుపడింది. అవినీతి జరిగినట్లు విచారణలో తేలడంతో వీఆర్వో అమ్మడిపూడి వెంకటేశ్వర్లను సస్పెండ్‌ చేస్తూ కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. వీఆర్‌వో వెంకటేశ్వర్లు అవినీతిపై సాక్ష్యాధారాలతో ఆంధ్రజ్యోతిలో వరుస కథనాలు రావడంతో స్పందించిన కందుకూరు సబ్‌ కలెక్టర్‌ అపరాజితాసింగ్‌ పోతలపాడు, గానుగపెంట రైతులను విచారించారు. వారి నుంచి స్టేట్‌మెంట్లను రికార్డు చేశారు. రైతుల వద్ద నుంచి రూ.లక్షలు వసూలు చేసినట్లు విచారణలో వెల్లడికావడంతో ఆ నివేదికలను కలెక్టర్‌కు అందజేశారు. వాటి ఆధారంగా ఆయన వీఆర్వోను సస్పెండ్‌ చేశారు. 



Updated Date - 2021-08-12T06:57:06+05:30 IST