Abn logo
Sep 21 2021 @ 17:29PM

భోగవల్లి సత్రం ట్రస్ట్ ఆస్తులపై మంత్రి కన్ను పడింది: పోతిన మహేష్

విజయవాడ: భోగవల్లి సత్రం ట్రస్ట్ ఆస్తులపై  దేవాదాయ శాఖ  మంత్రి కన్ను పడిందని జనసేన నేత పోతిన వెంకట మహేష్ అన్నారు. రూ.18 కోట్ల విలువ చేసే ఆస్తులను రెండున్నర కోట్లకు కొట్టేయాలని కుట్ర చేశారని ఆరోపించారు. ఆధారాలతో సహా అక్రమాలు బయట పడ్డాయన్నారు. ఇప్పుడు కొత్త నాటకంతో వెయ్యికి కక్కుర్తి పడే కొంతమంది కొత్త పోస్ట్‌లు పెడుతున్నారని చెప్పారు. ఫోర్జరీ సంతకం చేసి  ఫేక్ ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన 420  ఎవరో పోలీసు శాఖ  విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. కృష్ణ చైతన్య సంతకం డాక్యుమెంట్‌ల మీద ఒర్జినల్ ఉండగా... ఫోర్జరీ సంతకంతో ప్రెస్ నోట్ రిలీజ్ చేశారని చెప్పారు. అంటే... మంత్రి, అతని కోటరీ కొత్త కుట్రకు తెర లేపారని తెలుస్తుందన్నారు. దొంగ సంతకాలతో రూ.18 కోట్ల విలువైన ఆస్తులు కొట్టేసే ప్రయత్నం  ఇంకా కొనసాగుతుందని పేర్కొన్నారు. మంత్రి వెల్లంపల్లి గారి కోటరీ నేటికీ కూడా మాయ చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని  అడ్డదారుల్లో దేవాదాయ శాఖ ఆస్తులు కొట్టేయాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. వారికపై పోలీస్ శాఖ లోతైన  విచారణ చేపట్టాలన్నారు. దేవాదాయ శాఖకు సంబంధించిన ఆస్తులను కాపాడాలన్నారు. 


ఇవి కూడా చదవండిImage Caption

క్రైమ్ మరిన్ని...