Abn logo
Sep 25 2021 @ 17:19PM

నాడు తండ్రి నేడు కొడుకు ఎయిడెడ్ విద్యా వ్యవస్థను...: పోతిన మహేష్

విజయవాడ: ఎయిడెడ్ విద్యా వ్యవస్థను రద్దు చేయడం అంటే పేద సామాన్య వర్గాల పిల్లలకు ఉచిత విద్యను దూరం చేయడమేనని జనసేన నేత పోతిన వెంకట మహేష్ అన్నారు. జీవో నెంబర్ 50ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ చీకటి జీవో వలన రాష్ట్రంలో 2.5 లక్షల మంది  స్కూల్ స్థాయి విద్యార్థులకు మరియు 1.5 లక్షల మంది కళాశాల విద్యార్థులకు ఉచిత విద్య దూరమైపోతుందన్నారు. ఈ చీకటి జీవో వలన 1927 ఉచిత విద్యను అందించే పాఠశాలలు మూతపడ్డాయన్నారు. ఇకనుంచి మధ్యాహ్న భోజన పథకం, డ్రస్సులు పుస్తకాలు బ్యాగులు బూట్లు ఇవ్వాల్సిన అవసరం ఉండదన్నారు. మెగా డీఎస్‌స్సీ నిర్వహించకూడదని రాష్ట్రంలో నిరుద్యోగాన్ని  పెంచాలనే కుట్రలో భాగంగానే ఎయిడెడ్ విద్యా వ్యవస్థను రద్దు చేశారని చెప్పారు. ఎయిడెడ్ స్కూల్ మరియు కళాశాల యాజమాన్యాలపై ప్రభుత్వం ఒత్తిడి చేసి సంతకాలు చేయిస్తుందన్నారు. 2004లో వైఎస్ హయాంలో ఎయిడెడ్ స్కూల్లో నియామకాలపై బ్యాన్ విధించారని తెలిపారు. నేడు వైఎస్ జగన్ గారు ఎయిడెడ్ స్కూల్ విద్యా విధానాన్ని పూర్తిగా నిలుపుదల చేశారని పేర్కొన్నారు. నాడు తండ్రి నేడు కొడుకు ఎయిడెడ్ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. 

ఇవి కూడా చదవండిImage Caption

క్రైమ్ మరిన్ని...