Abn logo
Sep 26 2021 @ 10:53AM

AP: దేవాదాయశాఖ మంత్రిపై పోతిన విమర్శలు

విజయవాడ: దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌పై జనసేన నేత పోతిన వెంకట మహేష్ తీవ్ర విమర్శలు గుప్పించారు. శ్రీశైలం దేవస్థానంపైన నగరాల కులస్తులకు శాశ్వత ప్రాతిపదికన 50 సెంట్లు కేటాయించలేదని, అద్దె  ప్రాతిపదికన మాత్రమే కేటాయించారని ఆరోపించారు. చదరపు అడుగుకి పది రూపాయల చొప్పున ధర నిర్ణయించారన్నారు. మూడు సంవత్సరాలకొకసారి 30 శాతం అద్దె పెంచుతామని, కేవలం 11 ఏళ్లకు లీజు అగ్రిమెంట్ చేశారన్నారు. ఇదేదో నగరాలకు ఉచితంగా ఇచ్చినట్లు దేవాదాయ శాఖ మంత్రి ప్రచారం చేసుకుంటున్నారని పోతిన వెంకట మహేష్ విమర్శించారు.

ఇవి కూడా చదవండిImage Caption

క్రైమ్ మరిన్ని...