Advertisement
Advertisement
Abn logo
Advertisement

పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవానికి అడ్డదారుల్లో ప్రయాణం ఎందుకో?..: పోతిన మహేష్

విజయవాడ: పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవానికి  అడ్డదారుల్లో ప్రయాణం ఎందుకో మంత్రి వెల్లంపల్లి చెప్పాలని జనసేన నేత పోతిన మహేష్ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధాన రహదారుల్లో కాకుండా నియోజకవర్గంలో ప్రధాన రోడ్లన్నీ గోతులేనని తెలిసి పోతుందనా? అని ప్రశ్నించారు. మంత్రులు సుచరిత,  పెద్దిరెడ్డి, నానీలు వన్ టౌన్ కాళేశ్వరరావు మార్కెట్ నుంచి కేటి రోడ్డు, పాల ఫ్యాక్టరీ మీదుగా వెళ్లాలన్నారు. పశ్చిమంలో ప్రధాన రహదారులన్నీ గోతుల మయమని, ప్రజలు ఇబ్బందులు పడుతూ గోతులు పడ్డ రోడ్లపై నిత్యం ప్రయాణం చేయాలి?..  మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రం సాఫీగా ఉన్న రోడ్లపై ప్రయాణం చేస్తారా?.. ఇదెక్కడి న్యాయమని పోతిన మహేష్ ప్రశ్నించారు.

Advertisement
Advertisement