ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటుపరం చేయొద్దు : సీపీఎం

ABN , First Publish Date - 2020-08-11T10:25:59+05:30 IST

కరోనా సాకు చూపి కేంద్రంలోని బీజేపీ సర్కా రు ప్రభుత్వ రంగ సంస్థలన్నిటినీ ప్రైవేట్‌ పరం చేసేందుకు కుట్రపన్నుతోందని సీపీ ఎం నాయకులు ఆరోపించారు

ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటుపరం చేయొద్దు : సీపీఎం

నెల్లూరు (రూరల్‌), ఆగస్టు 10 : కరోనా సాకు చూపి కేంద్రంలోని బీజేపీ సర్కా రు ప్రభుత్వ రంగ సంస్థలన్నిటినీ ప్రైవేట్‌ పరం చేసేందుకు కుట్రపన్నుతోందని సీపీ ఎం నాయకులు ఆరోపించారు. సోమవారం సేవ్‌ ఇండియా పేరిట నెల్లూరు రూరల్‌ మండలంలోని పొట్టేపాళెం సచివాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. నాయకులు చంద్రమౌళి, తిరుపాలు మాట్లాడుతూ ప్రైవేటీకరణతో కార్మికులు ఎంతో నష్టపోతార ని, ప్రజలు హక్కులను కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రయత్నాన్ని మానుకోవాలని డిమాండ్‌ చేశారు. పేదలందరికీ ఉపాధి హామీ పథకాన్ని విస్తరించి రేషన్‌కార్డు కలిగిన ప్రతి వ్యక్తికి 10 కిలోల బియ్యం అందించాలని కోరారు. అనంత రం సచివాలయ ఉద్యోగికి వినతి పత్రం అందించారు. 

Updated Date - 2020-08-11T10:25:59+05:30 IST