రైతాంగాన్ని మరోసారి మోసం చేస్తున్న మోదీ: పోటు రంగారావు

ABN , First Publish Date - 2021-12-26T16:35:29+05:30 IST

కేంద్రప్రభుత్వం తిరిగి మూడు దుర్మార్గ వ్యవసాయ చట్టాలను తెస్తామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి తోమార్ ప్రకటించడం విద్రోహ పద్దతి..

రైతాంగాన్ని మరోసారి మోసం చేస్తున్న మోదీ: పోటు రంగారావు

అమరావతి: కేంద్రప్రభుత్వం తిరిగి మూడు దుర్మార్గ వ్యవసాయ చట్టాలను తెస్తామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి తోమార్ ప్రకటించడం విద్రోహ పద్దతి అని సీపీఐఎంఎల్ న్యూ డెమోక్రసీ తెలంగాణ రాష్ట్ర కమిటీ సహాయ కార్యదర్శి పోటు రంగారావు అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశ రైతాంగాన్నిమోదీ మరోసారి మోసం చేయడానికి రెడీ అయ్యారని ధ్వజమెత్తారు. యూపీ, పంజాబ్ ఎన్నికల కోసమే మోడీ చట్టాలపై వెనకకు తగ్గాడని వచ్చిన అభిప్రాయాలను నిజం చేసేదిగా తోమర్ ప్రకటన ఉందన్నారు. ఏడాది పాటు రైతాంగం ఆందోళన చేసి చట్టాలను వెనకకు నెడితే తిరిగి దొడ్డి దారిన తీసుక వస్తామని చెప్పడం, లేదా నేరుగా తెస్తామని చెప్పడం దారుణమన్నారు. కార్పొరేట్ ఆదానీ, అంబానీ లాబీనీ సంతృప్తి పరచడం కోసమే మోదీ ఈ ప్రకటన చేయించారని మండిపడ్డారు. దేశ వ్యవసాయ రంగం కంటే, రైతాంగం కంటే  కార్పొరేట్ లాబీ మీదనే మోడీ సర్కార్ కి ప్రేమ ఉందన్నారు. అందుకే ఎన్నికల కోసం వెనకడుగు వేసినట్లు చేశారని చిత్తశుద్ధితో కాదన్నారు. తిరిగి ఆ చట్టాలను తీసుకువచ్చే ప్రయత్నం చేస్తే దేశ రైతాంగం ఊరుకొదని పోటు రంగారావు హెచ్చరించారు. 

Updated Date - 2021-12-26T16:35:29+05:30 IST