Advertisement
Advertisement
Abn logo
Advertisement

విద్యకు పేదరికం అడ్డు కాకూడదు

ఉప ముఖ్యమంత్రి ఎస్‌బీ అంజద్‌బాషా

మూడో విడత విద్యా దీవెనలో రూ.46.20 కోట్లు జమ

కడప (కలెక్టరేట్‌), నవంబరు 30: విద్యకు పేదరికం ఏ మాత్రం అడ్డుకాకూడదన్నదే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి ఎస్‌బీ అంజద్‌బాషా తెలిపారు. మంగళవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్సు ద్వారా 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి మూడవ విడత జగనన్న విద్యాదీవెన లబ్ధి మొత్తాన్ని కంప్యూటర్‌ బటన్‌ నొక్కి నేరుగా అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేశారు. కార్యక్రమానికి కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాలు నుంచి డిప్యూటీ సీఎంతో పాటు కలెక్టర్‌ వి.విజయరామరాజు, ప్రభుత్వ విప్‌ కె.శ్రీనివాసులు, ఎమ్మెల్సీ రామచంద్రయ్య, బద్వేలు ఎమ్మెల్యే దాసరి పద్మ, జడ్పీ చైర్మన్‌ అమరనాథరెడ్డి, నగర మేయర్‌ సురేష్‌ బాబు, అడా చైర్మన్‌ గురుమోహన్‌, కడప ఆర్డీఓ ధర్మచంద్రారెడ్డి పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌ ముగిసిన అనంతరం జిల్లాలో 73,017 మంది విద్యార్థులకు మంజూరైన రూ.46,20,28,717ల జగనన్న విద్యాదీవెన మెగా చెక్కును విద్యార్థుల తల్లులకు అందజేశారు.

Advertisement
Advertisement