Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆన్‌లైన్‌లో పవర్ బ్యాంక్‌ కోసం ఆర్డర్ చేస్తే ఏమొచ్చిందో చూడండి... ఆ కుర్రాడికి ఏడుపొక్కటే తక్కువ... వైరల్ అవుతున్న ఫొటో

పండుగలు రాబోతున్నాయనగానే ఫెస్టివ్ సేల్ కూడా మొదలవుతుంది. పలు కంపెనీలు ఆన్‌లైన్ సేల్‌ను షురూ చేస్తుంటాయి. దీనిని చూసిన వినియోగదారులు ఎంతగానో ఆకర్షితులవుతుంటారు. తమకు ఇష్టమైన ప్రతీవస్తువునూ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అయితే ఆన్ లైన్ షాపింగ్‌లో మోసాలు కూడా చోటుచేసుకుంటుంటాయి. ఒక వస్తువు కోసం ఆర్డర్ చేస్తే మరో వస్తువు అందుకుని వినియోగదారులు లబోదిబోమనే సంఘటనలు కూడా చూసుంటాం. 

తాజాగా ఇటువంటి ఉదంతమొకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిని చూసినవారంతా ఆశ్చర్యపోతూ, ఆన్‌లైన్ షాపింగ్‌పై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే @RahulSi27583070 అనే యూజర్ తన ట్విట్టర్ ఖాతాలో ఒక ఫొటోను షేర్ చేసి, తాను 2000 ఎంహెచ్ పవర్ బ్యాంక్‌ను ఆర్డర్ చేశానని, అయితే ఈ మేరకు వచ్చిన పార్సిల్ తెరిచి చూస్తే, దానిలో ఇటుక ముక్క ఉందని తెలిపాడు. ఈ పోస్టు చూసిన పలువురు యూజర్లు తమకు ఎదురైన ఇటువంటి అనుభవాలను షేర్ చేస్తున్నారు.


ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement