విద్యుత కోత.. ఆపై బిల్లుల మోత: కాలవ

ABN , First Publish Date - 2021-10-22T06:42:59+05:30 IST

రాష్ట్రంలో అప్రకటిత విద్యుత కోతతో పాటు పెరిగిన విద్యుత చార్జీల బిల్లులు ప్రజల వీపు విమానం మోత మో గిస్తున్నాయని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు మండిపడ్డారు.

విద్యుత కోత.. ఆపై బిల్లుల మోత: కాలవ
గార్మెంట్స్‌ కార్మికులతో మాట్లాడుతున్న మాజీ మంత్రి కాలవ

రాయదుర్గంటౌన, అక్టోబరు 21: రాష్ట్రంలో అప్రకటిత విద్యుత కోతతో పాటు పెరిగిన విద్యుత చార్జీల బిల్లులు ప్రజల వీపు విమానం మోత మో గిస్తున్నాయని మాజీ మంత్రి, టీడీపీ  పొలిట్‌బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు మండిపడ్డారు. పురపాలక సంఘంలోని 7వ వార్డులో మాజీ జడ్పీచైర్మన పూల నాగరాజు, టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలసి గురువా రం ఆయన పర్యటించారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. క రెంటు కష్టాలు, అధిక బిల్లుల వసూళ్లను పలువురు ఆయన వద్ద ఏకరువు పెట్టారు. వాడిన యూనిట్ల కన్నా రెండింతలు కరెంటు బిల్లులు వస్తున్నాయని వారు బాధను వ్యక్తం చేశారు. కరోనా కష్టకాలం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తమకు మూడొంతులు ఎక్కువగా విద్యుత బిల్లులు వస్తున్నాయని గార్మెంట్స్‌ కార్మికులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు.


కరెంటు, గ్యాస్‌, డీజిల్‌తో పాటు వంట నూనె, పప్పుల ధరలు విపరీతంగా పెరిగాయని పలువురు మహిళలు వాపోయారు. ఫ్యాన గుర్తుకు ఓటేస్తే ఇన్ని క ష్టాలు వస్తాయని ఊహించలేదని పేర్కొన్నారు. అనంతరం కాలవ విలేక రులతో మాట్లాడారు. కరెంటు కష్టాలపై తెలుగుదేశం పార్టీ పోరాటం వల్ల ట్రూఅప్‌ చార్జీలను తాత్కాలికంగా నిలుపుదల చేయడం జరిగిందన్నారు. పట్టణంలో గార్మెంట్స్‌ పరిశ్రమపై వేలాది మంది ఆధారపడి జీవిస్తున్నారన్నారు. పెరిగిన విద్యుత చార్జీల కారణంగా గార్మెంట్స్‌ యజమానుల పరిస్థి తి వర్ణనాతీతంగా మారిందన్నారు. రెట్టింపు స్థాయిలో విద్యుత బిల్లులు వ స్తుండటంతో గార్మెంట్స్‌ యజమానులు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. విద్యుత బిల్లులు చూసి జనం ఖంగు తింటున్నారని పేర్కొన్నారు. పేద కుటుంబాలు విద్యుత చార్జీల భారాన్ని మోయలేక పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణం నాణ్యమైన విద్యుత సరఫరా చేయడంతో పాటు భవిష్యత్తులో అదనపు చార్జీలు వసూలు చేయబోమని స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో వార్డు ఇనచార్జ్‌ దబ్బడి శివ, కౌన్సిలర్‌ ప్రశాంతి, నాయకులు పొరాళ్లు పురుషోత్తమ్‌, బండి భారతి, అహ్మదీ, పూజారి తిప్పయ్య, శీన పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-22T06:42:59+05:30 IST