అవినీతి, దుబారా వల్లే విద్యుత్‌ కోతలు

ABN , First Publish Date - 2021-10-17T05:21:46+05:30 IST

సీఎం జగన్‌ అవినీతి, దుబారా వల్లే రాష్ట్రంలో విద్యుత్‌ కోతలు ప్రారంభమయ్యాయని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కిమిడి కళావెంకటరావు విమర్శించారు. శనివారం విలేకరులతో మాట్లాడుతూ.. అధికార పార్టీ నేతల చేతివాటం కారణంగా రాష్ట్రంలో చీకట్లు కమ్ముకుంటున్నాయన్నారు.

అవినీతి, దుబారా వల్లే విద్యుత్‌ కోతలు
మాట్లాడుతున్న కళావెంకటరావు

టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కళావెంకటరావు 

రాజాం. అక్టోబరు 16: సీఎం జగన్‌ అవినీతి, దుబారా వల్లే రాష్ట్రంలో విద్యుత్‌ కోతలు ప్రారంభమయ్యాయని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కిమిడి కళావెంకటరావు విమర్శించారు. శనివారం విలేకరులతో మాట్లాడుతూ.. అధికార పార్టీ నేతల చేతివాటం కారణంగా రాష్ట్రంలో చీకట్లు కమ్ముకుంటున్నాయన్నారు. యూనిట్‌కు రూ.20 చెల్లించి ప్రైవేటు సంస్థల నుంచి కొనుగోలు చేయాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో లోటును అధిగమించి విద్యుత్‌ను సాధించామన్నారు.  ప్రభుత్వ విద్యుత్‌ సంస్థలకు జగన్‌ ప్రభుత్వం రూ.12 వేల కోట్లు బకాయి పడిందన్నారు. ట్రూ అప్‌ చార్జీల పేరుతో ప్రజల నెత్తిన భారం మోపారని విమర్శించారు. రెండున్నరేళ్లలో వినియోగదారులపై రూ.36,802 కోట్లు భారం మోపారని ఆరోపించారు.

 

Updated Date - 2021-10-17T05:21:46+05:30 IST