తడి దుస్తుల నుంచి విద్యుదుత్పత్తి

ABN , First Publish Date - 2020-08-04T07:41:22+05:30 IST

కాదేదీ కరెంటుకు అనర్హం’ అనేలా ఐఐటీ ఖరగ్‌పూర్‌ శాస్త్రవేత్తలు సరికొత్త పరిజ్ఞానాన్ని ఆవిష్కరించారు. ఉతికి ఎండలో ఆరేసిన దుస్తుల నుంచి

తడి దుస్తుల నుంచి విద్యుదుత్పత్తి

ఐఐటీ ఖరగ్‌పూర్‌ శాస్త్రవేత్తల ఆవిష్కరణకు ‘గాంధీయన్‌’ అవార్డు

కోల్‌కతా, ఆగస్టు 3 : ‘కాదేదీ కరెంటుకు అనర్హం’ అనేలా ఐఐటీ ఖరగ్‌పూర్‌ శాస్త్రవేత్తలు సరికొత్త పరిజ్ఞానాన్ని ఆవిష్కరించారు. ఉతికి ఎండలో ఆరేసిన దుస్తుల నుంచి విద్యుదుత్పత్తి అవుతుందని నిరూపించారు. ప్రయోగంలో భాగంగా 50 దుస్తులను ఉతికి ఒక చోట ఎండలో ఆరవేశారు. వాటన్నింటిని ఒక కమర్షియల్‌ సూపర్‌ కెపాసిటర్‌తో అనుసంధానించగా.. 10 ఓల్టుల విద్యుత్తును ఉత్పత్తి చేసింది. దానితో ఎల్‌ఈడీ బల్బును గంటకుపైగా వెలిగించగలిగినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇందుకుగాను ‘గాంధీయన్‌ యంగ్‌ టెక్నాలజికల్‌ ఇన్నోవేషన్‌ అవార్డు’కు వారు ఎంపికయ్యారు. ఫ్లెక్సిబుల్‌ ఉపకరణాల్లో ఇంధన వినియోగం, థర్మల్‌ విద్యుత్తు సమస్యలకు పరిష్కారాన్ని చూపిన ఐఐటీ ఖరగ్‌పూర్‌కే చెందిన మరో బృందం కూడా అవార్డుకు ఎంపికైంది.

Updated Date - 2020-08-04T07:41:22+05:30 IST