పులిచింతలలో ప్రారంభమైన విద్యుదుత్పత్తి

ABN , First Publish Date - 2021-11-30T07:09:17+05:30 IST

మండలంలోని పులిచింతల ప్రాజెక్టులో అదివారం అర్ధరాత్రి విద్యుదుత్పత్తి తిరిగి ప్రారంభ మైంది. ఈ నెల 19న ఎగువ నుంచి నీటి రాకా పూర్తిగా నిలిచిపోవడంతో విద్యుదుత్పత్తి నిలిపివేశారు. ప్రాజెక్టులోకి ఎగువ నుంచి 3450 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది.

పులిచింతలలో ప్రారంభమైన విద్యుదుత్పత్తి
172.20 అడుగుల వద్ద పులిచింతల ప్రాజెక్టులో నీళ్లు

చింతలపాలెం నవంబరు29: మండలంలోని పులిచింతల ప్రాజెక్టులో అదివారం అర్ధరాత్రి విద్యుదుత్పత్తి తిరిగి ప్రారంభ మైంది. ఈ నెల 19న ఎగువ నుంచి నీటి రాకా పూర్తిగా నిలిచిపోవడంతో విద్యుదుత్పత్తి నిలిపివేశారు. ప్రాజెక్టులోకి ఎగువ నుంచి 3450 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టులోని పవర్‌ హౌస్‌లోని ఒక యూనిట్‌ ద్వారా 1000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తూ 15 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేస్తున్నట్లు టీఎస్‌ జెన్కో ఎస్‌ఈ దేశ్యానాయక్‌ తెలిపారు. ఈ ఏడాది పులిచింతల ప్రాజెక్టులో రికార్డు స్థాయి విద్యుత్‌ ఉత్పత్తి చేసినట్లు ఆయన తెలిపారు. 2019-2020లో 210 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేయగా, ఈ సంవత్సరానికి 219 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి లక్ష్యంగా టీఎస్‌ జెన్‌కో అధికారులు ఆ లక్ష్యాన్ని అధిగమించి  ఈ సంవత్సరం  రికార్డు స్థాయిలో ఐదు నెలల్లో 254.67 మిలియన్‌ యూనిట్ల విద్యుదుత్పత్తి చేసినట్లు ఆయన తెలిపారు.

Updated Date - 2021-11-30T07:09:17+05:30 IST