అధికారం శాశ్వతం కాదు: మాజీ మంత్రి సుజాత

ABN , First Publish Date - 2021-01-20T20:55:05+05:30 IST

ఏ వ్యక్తికి అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని సీఎం జగన్, వైసీపీ నాయకులు గ్రహించాలని మాజీ మంత్రి పీతల

అధికారం శాశ్వతం కాదు: మాజీ మంత్రి సుజాత

పాలకొల్లు: ఏ వ్యక్తికి అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని సీఎం జగన్, వైసీపీ నాయకులు గ్రహించాలని మాజీ మంత్రి పీతల సుజాత అన్నారు. బుధవారం  పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లులో టీడీపీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావును ఆమె పరామర్శించి ఆయన యోగక్షేమాలు తెలసుకున్నారు. ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు. ఈ సందర్భంగా సుజాత మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయలో మండిపడింది. పట్టణంలో జరిగిన టిడ్కో గృహాల పంపిణీ కార్యక్రమంలో టీడీపీ ప్రజా ప్రతినిధులకు తీవ్ర అవమానం జరిగిందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. 


మంత్రులకు, వైసీపీ నాయకులకు అధిక ప్రాధాన్యం ఇచ్చి టీడీపీకి చెందిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు కనీసం ప్రోటోకాల్ ప్రకారం కూడా అధికారులు గౌరవం ఇవ్వలేదని ఆరోపించారు. మంత్రి సమక్షంలోనే ఎమ్మెల్సీ అంగరని వైసీపీ నాయకులు తోసివేశారని ఆమె విమర్శించారు. ఎమ్మెల్సీ అంగరపై వైసీపీ నాయకుల దాడిని ఆమె తీవ్రంగా ఖండించారు. బడుగు, బలహీన వర్గాలను సీఎం జగన్ ప్రభుత్వం వేధిస్తోందన్నారు. వైసీపీ దాడులను టీడీపీ నాయకులు ధీటుగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో రాబోయేది టీడీపీ ప్రభుత్వమేననే విషయాన్ని వైసీపీ నాయకులు గుర్తుంచుకోవాలని సుజాత తెలిపారు. 

Updated Date - 2021-01-20T20:55:05+05:30 IST