Abn logo
Oct 25 2021 @ 00:09AM

రాష్ట్రస్థాయి పవర్‌ లిఫ్టింగ్‌ పోటీలకు 36 మంది ఎంపిక

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులతో జిల్లా ప్రతినిధులు

మంగళగిరి, అక్టోబరు 24: రాష్ట్రస్థాయి పవర్‌లిఫ్టింగ్‌ పోటీలకు జిల్లా నుంచి మొత్తం 36 మంది లిఫ్టర్లు ఎంపికయ్యారు. స్థానిక మాస్టర్‌ జిమ్‌ సెంటర్‌లో ఆదివారం జిల్లా పవర్‌ లిఫ్టింగ్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి జూనియర్‌, సబ్‌ జూనియర్‌ పోటీలు మహిళలు, పురుషులకు వేర్వేరుగా నిర్వహించారు. ఈ పోటీలకు మొత్తం 80 మంది లిఫ్టర్లు హాజరవ్వగా జరయ్యారు. 15 మంది మహిళలు, 21మంది పురుషులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు జిల్లా అసోసియేషన్‌ కార్యదర్శి గుమ్మడి పుల్లేశ్వరరావు తెలిపారు. వచ్చేనెల ఆరు, ఏడు తేదీలలో కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు వీరు హాజరవుతారని తెలిపారు.