సరఫరా లేకే కోతలు

ABN , First Publish Date - 2021-10-17T05:23:22+05:30 IST

జిల్లాలో డిమాండ్‌కు సరిపడా విద్యుత్‌ సరఫరా కావడం లేదు.

సరఫరా లేకే కోతలు

కరెంటు పొదుపు తప్పనిసరి 

సాయంత్రం 6 నుంచి 10 గంటల వరకు

ఏసీల వినియోగం కొంత తగ్గించాలి 

విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ జనార్దనరావు


ఏలూరు సిటీ, అక్టోబరు 16 : జిల్లాలో డిమాండ్‌కు సరిపడా విద్యుత్‌ సరఫరా కావడం లేదు. జిల్లావ్యాప్తంగా  రెండు మిలియన్‌ యూనిట్లు వరకు విద్యుత్‌ లోటు కనిపి స్తోంది. బొగ్గు కొరత కారణంగా విద్యుత్‌ లోటు ఏర్పడు తోంది. ఈ పరిస్థితులలో విద్యుత్‌ను పొదుపుగా వాడాల్సిన అవసరం ఉందని జిల్లా విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ  జనార్దన రావు అన్నారు. విద్యుత్‌ సమస్యలపై ఆయన ఆంధ్రజ్యోతితో మాట్లాడారు.. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..

  రెండు మిలియన్‌ యూనిట్లు లోటు

జిల్లాలో విద్యుత్‌ డిమాండ్‌ ఎక్కువగానే ఉంది. థర్మల్‌ విద్యుత్‌ స్టేషన్‌లలో విద్యుదుత్పత్తి  తగ్గింది. దీంతో జిల్లాకు రావాల్సిన విద్యుత్‌ కోటా తగ్గుతోంది. రోజువారీ జిల్లాలో విద్యుత్‌ డిమాండ్‌ 19 మిలియన్‌ యూనిట్లు వరకు ఉండగా ప్రస్తుతం రోజువారీ 17 మిలియన్‌ యూనిట్లు వరకు సరఫరా అవుతోంది. రెండు మిలియన్‌ యూనిట్లు లోటు కనిపిస్తోం ది. విద్యుత్‌ లోడ్‌ పరిస్థితులను బట్టి జిల్లాలో విద్యుత్‌ కోతలు విధించాల్సి వస్తోంది. శుక్ర, శనివారాల్లో విద్యుత్‌ సరఫరా ఎక్కువ కావడంతో లోటు తగ్గి కోతలు తగ్గాయి. 


  పొదుపు పాటించాల్సిందే..


సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రధానంగా ఏసీలు, విద్యుత్‌ మోటార్లు వాడకం తగ్గించాలి. పరిశ్రమలలో ఆ సమయంలో  లైటింగ్‌ లోడ్‌ మాత్రమే వినియో గించాలి. అవసరమైతే జనరేటర్లు వినియోగించుకోవాలి. ఆక్వా విద్యుత్‌ సర్వీసులకు సంబంధించి  సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు విద్యుత్‌ వాడకం తగ్గించాలి. 


  రెండు, మూడు గంటలు కోతలు'


జిల్లాలో రెండు నుంచి మూడు గంటల పాటు కోతలు విధించాల్సి వస్తోంది.  ఏపీ ట్రాన్స్‌కో ఫరిధిలో మొత్తం 21 సబ్‌స్టేషస్లు ఉన్నాయి. ఆయా విద్యుత్‌ ఫీడర్ల ఫరిధిలో డి మాండ్‌ విపరీతంగా పెరిగి విద్యుత్‌ ఫ్రీక్వెన్సీకి ఇబ్బందులు ఏర్పడే సమయంలో 2 నుంచి 3 గంటల పాటు లోడ్‌ రిలీఫ్‌ కింద విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నాం. వ్యవసాయానికి 9 గంటల పాటు పగటి పూట విద్యుత్‌ సరఫరా చేస్తున్నాం.


Updated Date - 2021-10-17T05:23:22+05:30 IST