ఏఐతో శక్తిమంతమైన యాంటీ బయాటిక్‌ గుర్తింపు

ABN , First Publish Date - 2020-02-23T07:20:42+05:30 IST

ప్రపంచంలోనే తొలిసారిగా కృత్రిమ మేధ(ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌)తో ఓ శక్తిమంతమైన యాంటీ బయాటిక్‌ ఆవిష్కృతమైంది.

ఏఐతో శక్తిమంతమైన యాంటీ బయాటిక్‌  గుర్తింపు

వాషింగ్టన్‌, ఫిబ్రవరి 22: ప్రపంచంలోనే తొలిసారిగా కృత్రిమ మేధ(ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌)తో ఓ శక్తిమంతమైన యాంటీ బయాటిక్‌ ఆవిష్కృతమైంది. దీన్ని అమెరికాలోని మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. 35 రకాల ప్రాణాంతక బ్యాక్టీరియాలనూ అంతమొందించే సామర్థ్యం కలిగిన ఈ సరికొత్త యాంటీ బయాటిక్‌కు ‘హ్యాలిసిన్‌’ అని పేరుపెట్టారు. డజన్ల కొద్దీ జగమొండి బ్యాక్టీరియాల పనిపట్టడాన్ని గుర్తించారు. దీనితో ఎలుకలపై ప్రయోగపరీక్షలు నిర్వహించగా, వాటికి సోకిన ఇన్ఫెక్షన్లను హ్యాలిసిన్‌ ద్రావణం 24 గంటల్లోనే మటుమాయం చేసింది. 

Updated Date - 2020-02-23T07:20:42+05:30 IST