మ‌హిళ‌ల కోసం ప్ర‌త్యేక‌ పీపీఈ కిట్‌... ఆ స‌మ‌స్య‌ల‌కు ఇక‌ చెక్‌!

ABN , First Publish Date - 2020-06-01T13:33:41+05:30 IST

కరోనాను ఓడిస్తున్న‌ ఫ్రంట్‌లైన్ వారియ‌ర్స్‌‌ కోసం గుజ‌రాత్‌లోని సూరత్ మహిళా ఆరోగ్య కార్యకర్తలు చీరపై లేదా ఇతర దుస్తులపై ధరించగలిగే తొలి పీపీఈ కిట్‌ను రూపొందించారు. ఈ కిట్ మహిళలకు...

మ‌హిళ‌ల కోసం ప్ర‌త్యేక‌ పీపీఈ కిట్‌... ఆ స‌మ‌స్య‌ల‌కు ఇక‌ చెక్‌!

సూర‌త్‌: కరోనాను ఓడిస్తున్న‌ ఫ్రంట్‌లైన్ వారియ‌ర్స్‌‌ కోసం గుజ‌రాత్‌లోని సూరత్ మహిళా ఆరోగ్య కార్యకర్తలు చీరపై లేదా ఇతర దుస్తులపై ధరించగలిగే తొలి పీపీఈ కిట్‌ను రూపొందించారు. ఈ కిట్ మహిళలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నందున దీనికి నారి కవచ్ కోవిడ్ -19 అనే పేరు పెట్టారు. సూరత్‌లోని ఫ్యాషన్ డిజైన్ డెవలప్‌మెంట్ సెంటర్‌కు అనుబంధంగా ఉన్న ఫ్యాషన్ డిజైనర్ సౌరవ్ మండల్ దీనిని స్వావలంబన భారత్‌ ప్రచారం కింద రూపొందించారు. ఈ కిట్‌ను సిట్రా మెడికల్ ల్యాబ్ కూడా ఆమోదించింది. ఈ  సంద‌ర్భంగా ఫ్యాషన్ ‌నోవా డైరెక్టర్ అనుపమ్ గోయెల్ మాట్లాడుతూ ఆరోగ్య కార్యకర్తలు, మ‌హిళా వైద్య సిబ్బంది సాధారణ పీపీఈ కిట్ ధరించ‌డం కార‌ణంగా 6 నుండి 8 గంటల పాటు బాత్రూంన‌కు వెళ్ళలేక‌పోతున్నారు. త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో అలా వెళ్లాల్సి వ‌స్తే ఆ కిట్ మళ్లీ ఉపయోగించకూడ‌దు. అయితే ఇప్పుడు కొత్త‌గా రూపొందించిన నారి కవచ్ కోవిడ్- 19తో మ‌హిళా వైద్య సిబ్బంది  ఇబ్బంది క‌లిగిన‌పుడు బాత్రూంన‌కు వెళ్ల‌గ‌లుగుతారు. త‌రువాత తిరిగి ఆ పీపీఈ కిట్ ధ‌రించ‌వ‌చ్చు. సల్వార్ కుర్తీ, చీర మొద‌లైన వాటిపై దీనిని‌‌ ధరించవచ్చు. ఇది స్త్రీల‌కు, పురుషుల‌కు కూడా ఉప‌యోగ‌ప‌డుతుంది. సాధారణ పీపీఈ కిట్ ఒకే మెటీరియ‌ల్‌తో ఉండగా, నారి కవచ్‌ కోవిడ్ -19 రెండు భాగాలుగా తయారు చేశారు. ఇది త్వ‌ర‌లోనే అంద‌రికీ అందుబాటులోకి రానున్న‌ద‌ని తెలుస్తోంది. 

Updated Date - 2020-06-01T13:33:41+05:30 IST