ఏరియా ఆస్పత్రి ఆవరణలోనే కరోనా పేషెంట్లకు వాడిన సామగ్రి.. పట్టించుకోని యాజమాన్యం

ABN , First Publish Date - 2020-08-03T20:30:15+05:30 IST

రామకృష్ణాపూర్‌ ఏరియాసుపత్రిలో కరోనా పేషెంట్లకు వాడిన సామగ్రిని ఆసుపత్రి ఆవరణలో ఆదివారం దర్శ నమిచ్చాయి. ఆసుపతి సిబ్బంది ఏ విధంగా విధులు నిర్వహిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.

ఏరియా ఆస్పత్రి ఆవరణలోనే కరోనా పేషెంట్లకు వాడిన సామగ్రి.. పట్టించుకోని యాజమాన్యం

రామకృష్ణాపూర్‌ (అదిలాబాద్): రామకృష్ణాపూర్‌ ఏరియాసుపత్రిలో కరోనా పేషెంట్లకు వాడిన సామగ్రిని ఆసుపత్రి ఆవరణలో ఆదివారం దర్శ నమిచ్చాయి. ఆసుపతి సిబ్బంది ఏ విధంగా విధులు నిర్వహిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఆసుపత్రి యాజమాన్యం కూడా ఈ విషయం లో చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నట్లు కార్మి కులు పేర్కొంటున్నారు. రామకృష్ణాపూర్‌ ఏరి యాసుపత్రిలో జనరల్‌ వైద్యంతోపాటు కరోనా ఐసోలేషన్‌ వార్డుగా మార్చారు.  కరోనా పేషెంట్లకు చికిత్స అందించే విషయంలో ఆసుపత్రి, కాంట్రాక్టు సిబ్బంది, వార్డు బాయ్‌ల మధ్య రోజు వాగ్వాదం జరుగుతోందని ఆసుపత్రి సిబ్బంది పేర్కొన్నారు. తమపైనే భారం మోపుతున్నారని ఏరియాసుపత్రి డీవైసీఎంఓతో కాంట్రాక్టు కార్మికులు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని పేర్కొంటు న్నారు. పీపీఈ కిట్ల నుంచి మొదలుకొని ఇక్కడ అన్ని విషయాలలో ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. యాజమాన్యం పట్టించుకోకపోవ డంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  


హాజీపూర్‌లో ఐదు కరోనా పాజిటివ్‌ 

హాజీపూర్‌ మండలంలో ఆదివారం ఐదు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో హాజీపూర్‌లో రెండు, గుడిపేటలో ఒకటి, నంనూర్‌లో ఒకటి, హాజీపూర్‌ పీహెచ్‌సీలో పనిచేసే సిబ్బంది ఒకరికి పాజిటివ్‌ నిర్ధారణ అయి నట్లు వైద్యాధికారులు పేర్కొన్నారు. హాజీపూర్‌ గ్రామపంచాయతీ పరిధిలో కొత్తగా రెండు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో, కట్టడి ప్రాంతాల్లో సోడియం హైపోక్లోరైడ్‌ ద్రావణాన్ని స్ర్పే చేయించారు. సర్పంచ్‌ రాజేశ్వరి ధర్మయ్య, ఎంపీటీసీ సుజాత-కిష్టయ్య, కారోబార్‌ ప్రభాకర్‌, ఆశ వర్కర్‌ రాజేశ్వరి, సత్యవతి పాల్గొన్నారు. 


మంచిర్యాల టౌన్‌: జిల్లా వాసులు ముగ్గురికి ఆదివారం పాజిటివ్‌ రిపోర్ట్‌ వచ్చిందని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. వీరు ఇతర జిల్లాల్లో కరోనా పరీక్షలు చేయించుకున్నారని పేర్కొన్నారు. ఆదివారం జిల్లా వ్యాప్తంగా ఎక్కడ కూడా కొవిడ్‌ -19 పరీక్షలు నిర్వహించలేదు.  కాగా, నస్పూర్‌లోని సింగరేణి ఐసోలేషన్‌ సెంటర్‌లో కనీస వసతులు కల్పించాలని కరోనా చికిత్స పొందుతున్న కార్మికులు కోరుతున్నారు. భోజనం కూడా సరిగ్గా పెట్టడం లేదని, ఇతర సదుపాయాలు అధ్వాన్నంగా ఉన్నాయని వారు ఆదివారం ఆంధ్రజ్యోతితో వాపోయారు. 


చికిత్స పొందుతూ వ్యాపారి మృతి.. కరోనాగా అనుమానం

ధ్రువీకరించని వైద్యాధికారులు

లక్షెట్టిపేట(ఆంధ్రజ్యోతి): లక్షెట్టిపేట పట్టణానికి చెందిన ఓ వ్యాపారి హైదరాబాద్‌ లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందాడు. తీవ్ర జ్వరంతో బాధపడుతూ మూడురోజుల క్రితం మంచిర్యాల ఆసుప త్రికి వెళ్ళగా అక్కడి వైద్యులు కరోనా లక్షణాలు ఉన్నాయనే అనుమానంతో బెల్లం పల్లి ఐసోలేషన్‌కు పంపించారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కావడంతో బెల్లం పల్లి నుంచి శనివారం ఉదయం హైదరాబాద్‌ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. ప్రభుత్వ నిబంధనల మేరకు జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో అక్కడే అంత్యక్రియలు జరిగాయని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ విషయంపై వైద్యాధికారులను వివరణ కోరగా సమాచారం లేదని పేర్కొన్నారు. వ్యాపారి నివాసముంటున్న ప్రాంతంతోపాటు మరికొన్ని చోట్ల సోడియం హైపోక్లోరై డ్‌ ద్రావణాన్ని పిచికారి చేశారు. వ్యాపారి మృతికి సంతాపంగా వ్యాపారులు దుకాణాలను మూసివేశారు. 

Updated Date - 2020-08-03T20:30:15+05:30 IST