Abn logo
Jul 24 2021 @ 00:47AM

సత్రాలకు లోతట్టు ప్రాంతాల ప్రజల తరలింపు

పెనుగంచిప్రోలులో మునేటి ప్రవాహాన్ని పరిశీలిస్తున్న అధికారులు

పెనుగంచిప్రోలు: మునేటికి వరదనీరు చేరటంతో పెనుగంచిప్రోలులో మునేటి ఒడ్డున లోతట్టు ప్రాంతాల ప్రజలకు తిరుపతమ్మ దేవస్థానం సత్రాలలో పునరావాసం కల్పించారు. మునేటి కాజ్‌వే వద్ద ప్రజలను అనుమతించటం లేదు.  తహసీల్దార్‌ పద్మజ, ఎస్సై హరిప్రసాద్‌, ఎంపీడీవో రాజు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని అధికారులు చెప్పారు.