Advertisement
Advertisement
Abn logo
Advertisement

రూర్బన్‌ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి

ఏలూరు రూరల్‌, నవంబరు 30 : మండలం లో రూర్బన్‌ పథకంలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని పీఆర్‌, ఆర్‌డీ స్పెషల్‌ కమిషనర్‌ శాంతిప్రియ పాండే అధికారులను ఆదేశించారు. పలు గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులు, స్వచ్ఛసంకల్పం, ఉపాధి హామీ పథకంలో ఎవెన్యూ ప్లాంటేషన్‌, సాలీడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ కేంద్రాలను ఆమె మంగళవారం పరిశీలించారు. ప్రతీ ఇంటికి వెళ్లి గ్రామంలో పరిశుభ్రతపై ఆరా తీశారు. మంచినీటి ఫిల్టరైజేషన్‌ జరుగుతుందో, లేదో ఆరా తీశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పట్టణ ప్రాంతాలకు దీటుగా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలతో పాటు గ్రామాల రూపురేఖలు మార్చే దిశగా అభివృద్ధి పనులు జరగాలన్నారు. జడ్పీ సీఈవో హరిహరనాథ్‌, డీపీవో రమేష్‌బాబు, డీఎల్‌పీవో సంపత్‌కుమారి, ఇన్‌చార్జి ఎంపీడీవో సరళకుమారి, పీఆర్‌ ఏఈ కృష్ణమోహన్‌, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ ఏపీవో కిషోర్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement