ప్రభాకర్‌రెడ్డి అక్రమ అరెస్ట్ జ‌గ‌న్ రాక్షస పాల‌న‌కు నిదర్శనం: చంద్రబాబు

ABN , First Publish Date - 2020-08-08T02:04:04+05:30 IST

మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి అక్రమ అరెస్ట్ జ‌గ‌న్ రాక్షస పాల‌న‌కు నిదర్శనమని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. విడుద‌లైన 24 గంట‌ల్లోపే మళ్లీ అరెస్ట్ చేయ‌డం

ప్రభాకర్‌రెడ్డి అక్రమ అరెస్ట్ జ‌గ‌న్ రాక్షస పాల‌న‌కు నిదర్శనం: చంద్రబాబు

విజయవాడ: మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి అక్రమ అరెస్ట్ జ‌గ‌న్ రాక్షస పాల‌న‌కు నిదర్శనమని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. విడుద‌లైన 24 గంట‌ల్లోపే మళ్లీ అరెస్ట్ చేయ‌డం ముమ్మాటికి క‌క్ష సాధింపు చ‌ర్యేనని తప్పుబట్టారు. కొవిడ్ నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘించిన వైసీపీ నాయ‌కులపై ఒక్క కేసు న‌మోదు చేయ‌లేదని, బ‌హిరంగ స‌మావేశాలు పెట్టిన ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి లాంటి వారిని వ‌దిలేశారని తెలిపారు. జేసీ కుటుంబ స‌భ్యుల‌పై మాత్రం త‌ప్పుడు కేసులు బ‌నాయిస్తున్నారని ఆక్షేపించారు. నియంతృత్వంతో ప్రజాభిమానం ఉన్న నాయ‌కుల‌ను అడ్డుకోలేరని, టీడీపీ నాయ‌కుల‌పై పెట్టిన అక్రమ కేసులు తక్షణమే ఎత్తివేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.















Updated Date - 2020-08-08T02:04:04+05:30 IST