ఢిల్లీ వెళ్ళి వచ్చిన వారిని గుర్తించాలి

ABN , First Publish Date - 2020-04-04T09:18:46+05:30 IST

జిల్లా నుంచి ఢిల్లీలో జరిగిన సమ్మేళనానికి వెళ్ళి వచ్చిన వారితో పాటు వారు కలిసిన ఇతరులను కూడా వెంటనే గుర్తించాలని కరోనా వైరస్‌ జిల్లా ప్రత్యేక అధికారి, అదనపు డీజీ కృపానంద త్రిపాఠీ ఉజాల, సౌత్‌కోస్టల్‌జోన్‌ ఐజీ జె.ప్రభాకరరావు తెలిపారు.

ఢిల్లీ వెళ్ళి వచ్చిన వారిని గుర్తించాలి

కరోనా నియంత్రణ చర్యలపై అదనపు డీజీ, ఐజీ సమీక్ష


గుంటూరు, ఏప్రిల్‌ 3: జిల్లా నుంచి ఢిల్లీలో జరిగిన సమ్మేళనానికి వెళ్ళి వచ్చిన వారితో పాటు వారు కలిసిన ఇతరులను కూడా వెంటనే గుర్తించాలని కరోనా వైరస్‌ జిల్లా ప్రత్యేక అధికారి, అదనపు డీజీ కృపానంద త్రిపాఠీ ఉజాల, సౌత్‌కోస్టల్‌జోన్‌ ఐజీ జె.ప్రభాకరరావు తెలిపారు. జిల్లాలో కరోనా వైరస్‌ నియంత్రణకు పోలీసుశాఖ తీసుకుంటున్న చర్యలు, ప్రస్తుతం జిల్లాలో నెలకున్న పరిస్థితిపై వారు శుక్రవారం సమీక్షించారు. అదనపు డీజీ మాట్లాడుతూ ఢిల్లీలో జరిగిన జమాత్‌కు వెళ్ళి వచ్చి అందుబాటులో లేని వారి వివరాల కోసం వివిధ కోణాల్లో విచారించి గుర్తించాలని ఆదేశించారు.


అంతేకాక వారి కుటుంబ సభ్యుల వివరాలు, వారు ఎవరెవరిని కలిశారో ఆయా వివరాలను, వారు ప్రయాణం చేసిన రైళ్ళలోని ఇతర ప్రయాణికుల వివరాలను సేకరించాలన్నారు. ఢిల్లీ వెళ్ళి వచ్చిన వారు, వారి కుటుంబ సభ్యులు స్వచ్ఛందంగా వైద్య పరీక్షలు చేయించుకునేలా వారికి నచ్చచెప్పాలని అధికారులను ఆదేశించారు. విదేశాల నుంచి వచ్చిన వారు వారి బంధువులపై కూడా నిఘా ఉంచాలన్నారు. అర్బన్‌, రూరల్‌ ఎస్పీలు  రామకృష్ణ, విజయరావు, అదనపు ఎస్పీలు ఈ సమీక్షలో పాల్గొన్నారు.

లాక్‌డౌన్‌ను కట్టుదిట్టంగా అమలు చేయండి

జిల్లాలో పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు లాక్‌డౌన్‌ను కట్టుదిట్టంగా అమలు చేయాలని సౌత్‌ కోస్టల్‌ జోన్‌ ఐజీ జె.ప్రభాకరరావు తెలిపారు. గుంటూరులో లాక్‌డౌన్‌ అమలు జరుగుతున్న తీరును శుక్రవారం ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ ట్రావెల్స్‌ బంగ్లా సెంటర్‌లో నగరంపాలెం సీఐ కోటేశ్వరరావు, వెస్ట్‌ ట్రాఫిక్‌ సీఐ వాసులకు పలు ఆదేశాలు ఇచ్చారు. స్వయంగా వాహన చోదకులతో మాట్లాడి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. 20 కేసుల్లో 8 కేసులు వన్‌టౌన్‌పరిధిలోనే ఉన్నందున తూర్పు నియోజకవర్గంలో లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేయాలన్నారు.  

Updated Date - 2020-04-04T09:18:46+05:30 IST