Apr 14 2021 @ 16:17PM

'రాధేశ్యామ్' సినిమాకి ప్రభాస్ సలహా..?

కొన్ని సందర్భాలలో సినిమా షూటింగ్ మొత్తం అయ్యాక కూడా చిత్ర యూనిట్‌లో హీరోగానీ, లేదా నిర్మాతగానీ.. ఒక్కోసారి దర్శకుడికే ఈ సీన్ మళ్ళీ చేస్తే బావుంటుందన్న ఉద్దేశంతో రీషూట్ చేయాలని డిసైడవుతుంటారు. ఏం చేసినా.. ఎంత చేసినా ఫైనల్‌గా ప్రేక్షకులు మెచ్చే సినిమా ఇవ్వడమే మేకర్స్ లక్ష్యం. కాగా టాలీవుడ్‌లో రూపొందుతున్న ఒక పాన్ ఇండియన్ సినిమాకి రీ షూట్ చేయాలని  దర్శక, నిర్మాతలు భావిస్తున్నట్టు లేటెస్ట్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ - పూజా హెగ్డే జంటగా నటిస్తున్న పీరియాడికల్ రొమాంటిక్ లవ్ స్టోరి 'రాధేశ్యామ్'. రాధకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు.

గోపీకృష్ణ మూవీస్ - టీ సిరీస్ బ్యానర్స్ సమర్పణలో యూవీ క్రియేషన్ బ్యానర్‌పై వంశీ - ప్రమోద్ - ప్రసీద భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ దాదాపు కంప్లీట్ అయి పోస్ట్‌ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతోంది. రీసెంట్‌గా ఈ సినిమా రషెష్‌ని ప్రభాస్ చూడటం జరిగిందిట. అందులో కొన్ని సీన్స్‌ని మళ్లీ చేద్దాం అని డైరక్టర్‌తో చెప్పినట్టు తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలీదు. ఇంతవరకు మేకర్స్ కూడా ఈ విషయంలో స్పందించలేదు. కాబట్టి రీ షూట్ అన్న వార్తల్లో నిజం లేదనిపిస్తోంది. ఇక 'రాధేశ్యామ్' సినిమాని జూలై 30న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కాగా ప్రభాస్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'సలార్' సినిమాతో పాటు ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బాలీవుడ్ స్ట్రైట్ సినిమా 'ఆదిపురుష్' సినిమా షూటింగ్స్‌లో పాల్గొంటున్నాడు.