May 17 2021 @ 10:35AM

‘సలార్’ కోసం ప్రభాస్ తొలిసారి ఆ పాత్రలో..

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ వ‌రుస సినిమాల‌తో బిజీ బిజీగా ఉన్నారు. ప్ర‌స్తుతం ఈయ‌న న‌టిస్తోన్న చిత్రాల్లో ‘స‌లార్’ ఒక‌టి. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌కుడు. ఎంతో క్రేజ్ క్రియేట్ చేసుకున్న ఈ ప్రాజెక్ట్  కోసం ప్ర‌భాస్ ఓ డిఫ‌రెంట్ రోల్‌లో న‌టిస్తున్నార‌ట‌. ఇంత‌కీ ప్ర‌భాస్ న‌టిస్తున్న పాత్రేంటో తెలుసా? ఆర్మీ ఆఫీస‌ర్ పాత్ర‌. ఈ సినిమాలో ప్ర‌భాస్ డ్యూయెల్ రోల్‌లో న‌టిస్తున్నార‌ని, అందులో ఓ రోల్ ఆర్మీ ఆఫీస‌ర్ రోల్ అని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు ఇలాంటి పాత్ర‌లో న‌టించ‌ని ప్ర‌భాస్ ప్రేక్ష‌కుల‌ను ఎలా మెప్పిస్తార‌నేది కూడా ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మే. శృతి హాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న‌ ‘సలార్’ను వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 14న విడుద‌ల చేస్తామ‌ని చిత్ర నిర్మాణ సంస్థ హోంబ‌లే ఫిలింస్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.