May 10 2021 @ 14:17PM

‘సలార్’ కోసం ప్రభాస్.. మరోసారి ఆ ప్రయత్నం..!

పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన టాలీవుడ్ హీరో ప్ర‌భాస్ వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్నారు. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ స్టార్ హీరో చేస్తున్న  ‘స‌లార్’ కోసం ప్ర‌భాస్ డ్యూయెల్ రోల్‌లో క‌నిపించ‌బోతున్నాడంటూ నెట్టింట వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. వివ‌రాల్లోకెళ్తే.. ‘స‌లార్’ సినిమాలో తండ్రీ కొడుకుల పాత్ర ఉంటుంది. ముందుగా తండ్రి పాత్ర‌లో మ‌రో న‌టుడిని నటింప చేయాల‌ని అనుకున్న‌ప్పటికీ కొన్ని కార‌ణాల‌తో కుదర‌లేదు. దీంతో ప్ర‌భాసే తండ్రి పాత్ర‌లోనూ క‌నిపిస్తాడ‌నే టాక్ వినిపిస్తోంది. ఇందులో తండ్రి పాత్ర కోసం ప్ర‌భాస్ ముస‌లివాడిగా మేక‌ప్ వేసుకోనున్నాడ‌ని,  ‘బాహుబ‌లి’ త‌ర్వాత ప్ర‌భాస్ తండ్రీ కొడుకులుగా క‌నిపిస్తారని స‌మాచారం.