Abn logo
Jul 31 2020 @ 22:50PM

ప్రభాస్‌ని ఈ సెంటిమెంట్‌ నుంచి నాగ్ అశ్విన్ గట్టెక్కిస్తాడా?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఇప్పుడొక సెంటిమెంట్‌ను చాలా బలంగా నమ్ముతున్నారు. బాలీవుడ్ హీరోయిన్‌తో ప్రభాస్ సినిమా చేస్తే.. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద నిలబడటం కష్టమే అనే సెంటిమెంట్ వారిని బాగా ఇబ్బంది పెట్టేస్తుంది. అందుకే ప్రభాస్ తదుపరి పిక్చర్‌లో హాట్ భామ దీపికా పదుకొనే నటిస్తుందనే వార్త వచ్చినా.. ప్రభాస్ ఫ్యాన్స్ పెద్దగా రియాక్ట్ అయినట్లుగా కనిపించలేదు. ఎందుకంటే ప్రభాస్ చేసిన ‘ఏక్ నిరంజన్‌’లో కంగనా రనౌత్, ఇటీవల వచ్చిన ‘సాహో’ చిత్రంలో శ్రద్ధాకపూర్‌లు నటించారు. ఆ రెండు సినిమాల బాక్సాఫీస్ రిజల్ట్ ఏమిటో అందరికీ తెలిసిందే.


ప్రభాస్ పాన్ ఇండియా స్టార్. ఆయన సరసన మాములు హీరోయిన్‌లు అయితే అస్సలు సరిపోరు. కానీ సౌత్ హీరోయిన్స్‌ అయితేనే ప్రభాస్‌కు లక్ కలిసి వస్తుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. అందులోనూ నాగ్ అశ్విన్ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకొనే అనగానే ప్రభాస్ సంగతేమో కానీ, ఆమె పేరు బాగా హైలెట్ అవుతుంది. ఇది కూడా ప్రభాస్ ఫ్యాన్స్‌కి నచ్చడం లేదు. భారీ పారితోషికం, డిమాండ్స్ అంటూ ఏవేవో చెబుతున్నారు. అసలు ప్రభాస్ సరసన దీపికా అవసరమే లేదు. నార్మల్‌గా ఏ సౌత్ బ్యూటీ నటించినా చాలు.. ప్రభాస్ మొత్తం చూసుకుంటాడు అనేలా ప్రభాస్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ప్రభాస్ ఫ్యాన్స్ నమ్ముతున్న ఈ సెంటిమెంట్ నుంచి ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్ ఎలా గట్టెక్కిస్తాడో చూద్దాం?

Advertisement
Advertisement
Advertisement