Oct 9 2021 @ 11:44AM

'సలార్' మూడవ షెడ్యూల్‌కి రెడీ అవుతున్న ప్రభాస్..!

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. వీటిలో భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న 'సలార్' ఒకటి. ఈ మూవీ మూడవ షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానున్నట్టు సమాచారం. ఇప్పటికే డైరెక్టర్ రాధాకృష్ణ దర్శకత్వంలో నటిస్తున్న 'రాధేశ్యామ్' చిత్రాన్ని పూర్తి చేశాడు ప్రభాస్. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ రూపొందిస్తున్న 'సలార్', ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందుతున్న బాలీవుడ్  స్ట్రైట్ మూవీ 'ఆదిపురుష్' షూటింగ్ దశలో ఉన్న సంగతి తెలిసిందే. ముంబైలో 'ఆదిపురుష్' షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ క్రమంలోనే ఆల్రెడీ రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న 'సలార్' సినిమా మూడవ షెడ్యూల్‌కు మేకర్స్ రెడీ అవుతున్నారట. ఈ షెడ్యూల్‌లో మెజారిటీ భాగం భారీ యాక్షన్‌ సన్నివేశాలను పూర్తి చేయనున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు సినిమాకి కేటాయించిన బడ్జెట్‌లో అధికభాగం ఈ షెడ్యూల్‌కే ఖర్చు చేస్తున్నట్టు సమాచారం. ఇందులో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది.