Jul 23 2021 @ 19:56PM

ఆసియాలో బాహుబలే అందగాడు!

ఫ్యాన్సీ ఆడ్స్‌ అనే సంస్థ నిర్వహించిన ‘టాప్‌ టెన్‌ మోస్ట్‌ హ్యాండ్సమ్‌ ఏసియన్‌ మెన్‌’ సర్వేలో ప్రభాస్‌ నంబర్‌వన్‌గా నిలిచారు. ఆ సంస్థ నిర్వహించి పోల్‌లో ఎక్కువమంది ప్రభాస్‌కే ఓటేశారు. ఈ జాబితాలో సౌత్‌ కొరియన్‌ స్టార్‌ కిమ్‌ హ్యూన్‌ జూంగ్‌, పాకిస్తాన్‌ నటులు ఇమ్రాన్‌ అబ్బాస్‌, ఫవాద్‌ ఖాన్‌ తదితరులను ఆయన అధిగమించారు. ‘బాహుబలి’ తర్వాత జపాన్‌, చైనా దేశాల్లో ప్రభాస్‌ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ పెరిగింది. ఆయనను చూడాలని కొంతమంది అభిమానులు విదేశాల నుంచి హైదరాబాద్‌కు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. దీన్ని బట్టి ప్రభాస్‌కు ఉన్న కేజ్‌ ఏంటో తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘రాధే శ్యామ్‌’, ‘ఆదిపురుష్‌’, ‘సలార్‌’ చిత్రాలు సెట్స్‌ మీద ఉన్నాయి. 

నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో మరో సినిమా అంగీకరించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం శనివారం ప్రారంభం కానుంది. ఈ నాలుగూ కాకుండా హిందీ దర్శకుడు సిద్ధార్థ్‌ ఆనంద్‌తో మరో సినిమా చర్చల్లో ఉందని సమాచారం.