Abn logo
Mar 25 2020 @ 09:54AM

ప్రభాస్-నాగ్ అశ్విన్ సినిమా మరింత ఆలస్యం?

యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ దేశవ్యాప్తంగా క్రేజ్ కలిగి ఉన్న పాన్ఇండియా హీరో. అయితే ఒక్కో సినిమాకు దాదాపు రెండు మూడేళ్ల సమయం తీసుకుంటూ అభిమానులను నిరాశకు గురిచేస్తున్నాడు. అన్నీ భారీ సినిమాలు చేస్తుండడమే దీనికి కారణం. ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నాడు. ఇటీవలె జార్జియా షెడ్యూల్ ముగించుకుని చిత్రబృందం భారత్‌కు వచ్చింది. 


ఈ సినిమా తర్వాత దర్శకుడు నాగ్ అశ్విన్ రూపొందించబోయే చిత్రంలో ప్రభాస్ నటిస్తాడు. అత్యంత భారీ బడ్జెట్‌తో సైన్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కబోతున్న ఈ చిత్రం షూటింగ్‌ను ఈ ఏడాది చివర్లో ప్రారంభించాలని అనుకున్నారు. ప్రస్తుతం కరోనా కారణంగా దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమ లాక్‌డౌన్ అయింది. మళ్లీ షూటింగ్‌లు ఎప్పుడు ప్రారంభమవుతాయో తెలీదు. పరిస్థితి చక్కబడిన తర్వాత ప్రభాస్ ముందుగా రాధాకృష్ణ సినిమాను ప్రారంభించాలి. అది పూర్తయిన తర్వాతే నాగ్ అశ్విన్ సినిమాను పట్టాలెక్కిస్తాడు. వచ్చే వేసవి తర్వాతే నాగ్ అశ్విన్ సినిమా పట్టాలెక్కుతుందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 


Advertisement
Advertisement
Advertisement